Twitter vs Threads: మెటా థ్రెడ్స్ యాప్‌ను జూలై 6వ తేదీన లాంచ్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ యాప్ 100 మిలియన్ల యూజర్‌బేస్‌ను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొదట్లో థ్రెడ్స్ దూకుడు చూసి ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందని అందరూ అనుకున్నారు.
అయితే అది ఆరంభ శూరత్వమే అయింది. మొదట్లో బాగా యూజర్స్‌ను సంపాదించిన థ్రెడ్స్ యూజర్ బేస్ పెరగడం స్లో అయింది. మార్కెట్ విశ్లేషణ సంస్థ సెన్సార్ టవర్ డేటా ప్రకారం జూలై 6వ తేదీన లాంచ్ అయిన నాటితో పోలిస్తే థ్రెడ్స్ ట్రాఫిక్ 75 శాతం తగ్గింది. అంటే యూజర్లు ఈ ప్లాట్‌ఫారం నుంచి నిష్క్రమిస్తున్నారని అర్థం.
సిమిలర్ వెబ్ అనే రీసెర్చ్ సంస్థ నుంచి వచ్చిన డేటా ప్రకారం థ్రెడ్స్ యాప్‌లో వినియోగదారులు ఖర్చు చేసే సగటు సమయం ఐవోఎస్‌లో 19 నిమిషాల నుంచి నాలుగు నిమిషాలకు, ఆండ్రాయిడ్‌లో 21 నిమిషాల నుంచి ఐదు నిమిషాలకు తగ్గింది.
థ్రెడ్స్‌పై ఎందుకు ఇంట్రస్ట్ తగ్గుతోంది?
ఫ్రాంక్‌గా చెప్పాలంటే యూజర్స్ థ్రెడ్స్‌పై ఇంట్రస్ట్ చూపడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ యాప్ పెట్టడానికి బేసిక్ కారణంగా ఏంటో వినియోగదారులకు అర్థం కావడం లేదు. మెటా కూడా ఈ యాప్‌ను ఇంతవరకు అప్‌డేట్ చేయలేదు. ఈ యాప్‌లో ట్విట్టర్ లాగానే పోస్ట్ చేయడానికి వ్యక్తులను అనుమతిస్తుంది.
కానీ ప్రస్తుతం ఇందులో ట్విట్టర్ అందిస్తున్న మేజర్ ఫీచర్లు ఏమీ లేవు. దీనికి డీఎం ఆప్షన్ లేదు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ట్విట్టర్‌కు చేస్తున్న మార్పులు అందులోని యూజర్లకు నచ్చడం లేదు. నిజానికి వారందరూ ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. థ్రెడ్స్ ప్రారంభంలో కాస్త ప్రామిసింగ్‌గా అనిపించింది కానీ కంపెనీ కూడా దీనిపై సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. ట్విట్టర్‌ని ఎంత తిట్టుకున్నా మళ్లీ అక్కడికే రావాలి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ట్విట్టర్‌కు సరిగ్గా పోటీని ఇచ్చే యాప్ ఏదీ లేదు.
ట్విట్టర్ లోగోలో మార్పు?
ఎలాన్ మస్క్ ట్విట్టర్ బ్రాండ్ లోగో మార్చనున్నట్లు హింట్ ఇచ్చారు. అంటే ఇకపై కనిపించే పక్షి ఇక కనిపించదన్న మాట. ఈ రాత్రికి ఎవరైనా ఎక్స్ లోగోకు సంబంధించిన మంచి డిజైన్‌ను పోస్ట్ చేస్తే, రేపు ఉదయం దానిని ఎక్స్ (ట్విట్టర్) లోగోగా మారుస్తామని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇది కాకుండా ఎలాన్ మస్క్ ట్విట్టర్ డిఫాల్ట్ కలర్ ఆప్షన్‌ను తెలుపు నుంచి నలుపుకు మార్చాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించారు.
Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial