కరోనావైరస్ వచ్చాక అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఓటీటీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీనికి తగ్గట్లే ఓటీటీలు నేరుగా సినిమాలు కొనుగోలు చేశాయి కూడా. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 వంటి పెయిడ్ ఓటీటీలతో పాటు ఉచితంగా లభించే ఓటీటీ ప్లాట్‌ఫాంలు కూడా ఉన్నాయి. వాటిలో ఐదు బెస్ట్ ఏంటో ఓ లుక్కేయండి.

1. MX Playerఫ్రీగా లభించే ఓటీటీల్లో ఎంఎక్స్ ప్లేయర్ ముందుస్థానంలో ఉంటుంది. ఇందులో ఆశ్రమ్ లాంటి ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్‌లు కూడా ఉంటాయి. అయితే ఫ్రీ సర్వీస్ కాబట్టి యాడ్లు మాత్రం మధ్యలో వస్తూ ఉంటాయి. ఒకప్పుడు వీడియో ప్లేయర్‌గా ఉండే ఎంఎక్స్ ప్లేయర్  తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫాంగా మారింది.

2. Jio Cinemaఇది జియో ఓటీటీ ప్లాట్‌ఫాం. జియో యూజర్లు దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు. అయితే ఇందులో కూడా యాడ్స్ వస్తాయి. జియో యూజర్లు కేవలం ఓటీటీనే కాకుండా జియో టీవీ యాప్ ద్వారా టీవీ చానెళ్లను కూడా చూడవచ్చు.

3. TVF Playయాస్పిరెంట్స్ వంటి టాప్ రేటెడ్ సిరీస్‌ను నిర్మించింది టీవీఎఫ్‌నే. ఇందులో ఇలాంటి సిరీస్‌లు ఎన్నో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో కూడా దీనికి సంబంధించిన యాప్ అందుబాటులో ఉంది. లాగిన్ అయి ఉచితంగా వీక్షించవచ్చు.

4. Airtel Xstreamఇది ఎయిర్ టెల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫాం అని చెప్పవచ్చు. మీ ఎయిర్ టెల్ నంబర్‌తో లాగిన్ అయి ఇందులో ఉన్న కంటెంట్‌ను ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు.

5. Vi Movies & TVవొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఈ ప్లాట్‌ఫాం ద్వారా కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. మీ దగ్గర వొడాఫోన్ ఐడియా సిమ్ ఉంటే దానితో లాగిన్ అయితే చాలు.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!