‘జాతి రత్నాలు’ సినిమాలో కోర్టు సీన్ మీకు గుర్తుందా? అందులో ఓ కేసులో అరెస్టయిన హీరో, అతడి స్నేహితులకు కేసు వాదించే ఫరియా అబ్దుల్లా.. ‘‘ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి’’ అన్నట్లుగా ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. కారులో సెక్స్ చేసిన ఓ మహిళ.. తనకు సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ (STD)రావడానికి.. ఆ కారే కారణమని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. ఆ కారు బీమా సంస్థపై రూ.40 కోట్ల దావా వేసింది. ఈ కేసు విచారించిన కోర్టు.. ఆమె వాదనను సమర్దిస్తూ.. ఆ రూ.40 కోట్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆ బీమా సంస్థ దిక్కుతోచని స్థితిలో ఉంది. త్వరలోనే ఆమెకు ఆ బీమా మొత్తం అందే అవకాశం ఉంది.
అమెరికాలోని మిస్సౌరీలో నివసిస్తున్న ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కారులో సెక్స్ చేసింది. ఆ తర్వాత ఆమె లైంగిక వ్యాధి సంక్రమించింది. ఇందుకు ఆ కారు బీమా సంస్థే బాధ్యత వహించాలంటూ ఆమె ఇన్సురెన్స్ సంస్థ GEICOపై 5.2 మిలియన్లు (రూ.40 కోట్లు) దావా వేసింది. ఇటీవల ఈ కేసును విచారించిన జాక్సన్ కౌంటీ కోర్టు ఆమె వానదను సమర్థించింది.
అయితే, ఈ క్లెయిమ్ పాలసీ పరిధిలోకి రాదని ఆ బీమా సంస్థ వాదించింది. వారు కారులో సెక్స్ చేసుకుంటే బీమా సంస్థ ఎందుకు బాధ్యత వహించాలని ఆ సంస్థ న్యాయవాదుల వాదించారు. అయితే, ఆమె తరఫు న్యాయవాదులు మాత్రం బీమా సంస్థకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు. ఆ కారుకు బీమా కడుతున్న కస్టమర్(ఆమె ప్రియుడు) తనకు STD ఉందనే విషయాన్ని చెప్పకుండా ఆమెతో కారులో సెక్సులో పాల్గొన్నాడని తెలిపారు. కారులో కలిసినప్పుడే ఆమెకు ఆ నష్టం జరిగింది కాబట్టి. ప్రతిఫలంగా ఆ కారు సంస్థ ఆమె వైద్య ఖర్చులకు, జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని ఆమె న్యాయవాదులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కోర్టు బాధితురాలికి సానుకూలంగా తీర్పు ఇచ్చింది. దిగువ కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని GEICO సంస్థ ఫెడరల్ కోర్టులో సవాల్ చేసింది. అయితే, అక్కడ కూడా బీమా సంస్థకు చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసును ఆమె ఫిబ్రవరి, 2021లో నమోదు చేసింది. 2017 సంవత్సరంలో కారులో జరిగిన సెక్స్ వల్ల బాధితురాలికి హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV)ని సంక్రమించిందని, అసురక్షిత సెక్స్‌కు ఆ కారే డైరెక్టుగా లేదా ఇన్‌డైరెక్టుగా కారణమైంది కాబట్టి, బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిదేనని పేర్కొంది. అతడికి హెచ్‌పీవీ ఉందని తెలిసి కూడా అతడు ఆమెతో సెక్సులో పాల్గొన్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ కారు కస్టమర్ చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ.. ఆ బీమా పాలసి ద్వారా ఆమెకు పరిహారం చెల్లించాలనేది కోర్టు ఉద్దేశం. మరి, ఆ బీమా సంస్థ ఏం చేస్తుందో చూడాలి.
Also Read: చేపలు తింటే చర్మ క్యాన్సర్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు
Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి