టెలిగ్రామ్.. సోషల్ మీడియాలో మరో క్రేజీ చాటింగ్ యాప్ ఇది. వాట్సాప్‌లో లేని కొన్ని భిన్నమైన ఆప్షన్లు టెలిగ్రామ్‌లో చూడవచ్చు. అందుకే, యూజర్స్ నెమ్మది నెమ్మదిగా టెలిగ్రామ్‌కు షిఫ్ట్ అవుతున్నారు. కొందరైతే ప్రైవసీ, పైరేటెడ్ కంటెంట్ కోసం కూడా టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ యాప్‌లో ఇన్ని రోజులు ఓ లోటు అయితే ఉంది. అదే.. స్టేటస్.
ఔనండి, వాట్సాప్‌లో 24 గంటలు యాక్టీవ్‌గా ఉండే స్టేటస్ ఆప్షన్.. ‘టెలిగ్రామ్’లో లేదు. దీంతో చాలామందికి ఆ మజా రావడం లేదు. అందుకే, ‘టెలిగ్రామ్’ కీలక నిర్ణయం తీసుకుంది. తమకు వస్తున్న రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకుని, మరింత మంది యూజర్స్‌ను ఆకట్టుకొనేందుకు టెలిగ్రామ్‌లో కూడా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే స్టేటస్, స్టోరీస్ తరహాలో ఒక ఆప్షన్ చేర్చాలని నిర్ణయించింది. కాబట్టి, త్వరలోనే టెలిగ్రామ్ యూజర్స్ ‘స్టేటస్’లు టెలిగ్రామ్‌లో చూసుకోవచ్చన్నమాట.
దీనిపై ‘టెలిగ్రామ్’ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ డ్యూరోవ్ మాట్లాడుతూ.. వినియోగదారుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, వారి అభిరుచి మేరకే ఈ కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. అంతేకాదు, తమ వినియోగదారుల ప్రైవసీకి కూడా టెలిగ్రామ్ ప్రాముఖ్యత ఇవ్వనుందని, వారు ఎవరైతే తమ స్టేటస్‌లను చూడాలని అనుకుంటారో.. వారికి మాత్రమే కనిపించేలా ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. (ఇప్పటికే ఈ ఆప్షన్ వాట్సాప్‌లో ఉంది). అలాగే, ఒక గ్రూపును ఏర్పాటు చేసుకుని.. వారికి మాత్రమే కనిపించే విధంగా కూడా తమ స్టేటస్‌లను పోస్ట్ చేయొచ్చని అన్నారు.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలోనే ‘టెలిగ్రామ్’ స్టోరీస్ లేదా స్టేటస్‌లను స్క్రీన్ ఎగువ భాగంలోనే ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అంతేకాదు, స్టోరీస్‌లో పెట్టుకొనే ఫొటోలు, వీడియోలను ఎడిటింగ్ చేసుకొనేందుకు వీలుగా టూల్స్ కూడా ఉంటాయన్నారు. అలాగే, క్యాప్షన్సు యాడ్ చేయడమే కాకుండా అందులో లింక్‌లు షేర్ చేసుకోవడం, ఇతర వినియోగదారులను ట్యాగ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయని తెలిపారు. అలాగే డ్యూయెల్ కెమేరా గల ఫోన్లలో.. ముందు, వెనుక కెమేరాల నుంచి ఏకకాలంలో రికార్డు చేసే వీలు కల్పిస్తామన్నారు.
స్టేటస్‌కు టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు
సాధారణంగా వాట్సాప్‌లో పెట్టే స్టేటస్ 24 గంటలు ఉంటుంది. ఆ తర్వాతే డిలీట్ అవుతుంది. అయితే, టెలిగ్రామ్‌లో మాత్రం మీరు పెట్టే స్టేటస్‌కు టైమ్ సెట్ చేసుకోవచ్చు. వారు పెట్టే స్టేటస్‌ను 6, 12, 24 లేదా 48 గంటల వరకు కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఒక వేళ మీకు యూట్యూబ్ చానెల్ ఉన్నట్లయితే ఆ కంటెంట్‌ను కూడా స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. ఫలితంగా వ్యూస్, సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకోవచ్చు. తమ కంటెంట్‌ను వైరల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్టేటస్ ఆప్షన్ టెస్ట్ దశలో ఉన్నాయి. ఇది జులై నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఒక వేళ మీ దగ్గర ‘టెలిగ్రామ్’ యాప్ లేనట్లయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!
(టెలిగ్రామ్‌లో మరిన్ని ఆసక్తికర కథనాల కోసం చూసేందుకు పక్కన ఉన్న లింక్ క్లిక్ చేయండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial)