టెక్నో స్పార్క్ 8సీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు, 90 హెర్ట్జ్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో డీటీఎస్ స్టీరియో సౌండ్, వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లే, ఎన్ఎన్‌సీ సపోర్ట్ అందించారు. ఏఐ ఆధారిత కెమెరా ఎఫెక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి.
టెక్నో స్పార్క్ 8సీ ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. నైజీరియా, థాయ్ ల్యాండ్‌ల్లో ఈ ఫోన్ డైమండ్ గ్రే, ఐరిస్ పర్పుల్, మ్యాగ్నెట్ బ్లాక్, టర్కోయిస్ సియాన్ రంగుల్లో లాంచ్ అయింది. టెక్నో స్పార్క్ 8 మనదేశంలో రూ.7,999 ధరతో లాంచ్ అయింది. దీని తర్వాత వెర్షన్ టెక్నో స్పార్క్ 8టీ కూడా రూ.8,999 ధరతో లాంచ్ అయింది. టెక్నో స్పార్క్ 8సీ స్మార్ట్ ఫోన్ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
టెక్నో స్పార్క్ 8సీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డాట్ నాచ్ డిస్‌ప్లేను అందించారు. ప్రాసెసర్ వివరాలు ఇంకా తెలియరాలేదు.. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఫోన్ వెనకవైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.9 సెంటీమీటర్లుగా ఉంది.