Symphony Wall Mounted Air Cooler: ప్రస్తుతం మనదేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మేలో ఉక్కపోతలు పీక్స్‌లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ తమ శక్తిని బట్టి ఎయిర్ కండీషనర్ (ఏసీ) కానీ, కూలర్ కానీ కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ఏసీ ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి... అంత మొత్తం ఖర్చు చేయలేని వారు కూలర్ కొనాలనుకుంటున్నారు.


ప్రస్తుతం మనదేశంలో ఎన్నో కూలర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సింఫనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ కూలర్ మాత్రం చాలా స్పెషల్. దీన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే చూడగానే ఏసీ అనిపిస్తుంది. కానీ కూలర్ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు. అదే సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్.


సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్ ధర (Symphony Cloud Personal Cooler with Remote Price)
అమెజాన్‌లో ఈ కూలర్‌ను రూ.13,699కు విక్రయిస్తున్నారు. ఈ కూలర్ అసలు ధర రూ.14,999 కాగా... తొమ్మిది శాతం డిస్కౌంట్‌తో ఇది అందుబాటులో ఉంది. దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. నెలకు రూ.645 చెల్లిస్తూ ఈఎంఐ ద్వారా కూడా ఈ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనికి ఒక సంవత్సరం వారంటీని కూడా కంపెనీ అందిస్తుంది.


సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్ స్పెసిఫికేషన్లు (Symphony Cloud Personal Cooler with Remote Features)
ఈ కూలర్ కెపాసిటీ 15 లీటర్లుగా ఉంది. అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా ఈ కూలర్ అందుబాటులో ఉంది. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని ఈ కూలర్ చల్లగా ఉంచుతుంది. త్రీ సైడ్ కాలింగ్ ప్యాడ్ కూడా ఇందులో అందించారు.


గదిలో తేమ త్వరగా తగ్గింపోయేందుకు డీహ్యుమిడిఫై సిస్టంను కూడా ఈ కూలర్‌లో అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కూలర్‌తో పాటు రిమోట్‌ను కూడా అందించనున్నారు. ఈ రిమోట్ ద్వారా కూలర్‌ను కంట్రోల్ చేయవచ్చు. కూలర్‌లో నీళ్లు నింపేందుకు మ్యాజిక్ ఫిల్ అనే పైప్ తరహా డివైస్‌ను కూడా అందించారు. ఇందులో ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయని సింఫనీ అంటోంది.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!