Sony TWS EarBuds: సోనీ ఇన్‌జోన్ బడ్స్ ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో ఇయర్ ఫోన్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇవి ఇన్ ఇయర్ డిజైన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ) ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. ఇది ఎక్స్‌టర్నల్ నాయిస్‌ను తగ్గిస్తుంది. వీటిలో 8.4 ఎంఎం డ్రైవర్లను అందించారు. యూఎస్‌బీ టైప్-సీ డాంగిల్ కనెక్షన్ ఫీచర్ కూడా ఉంది. దీంతో లేటెన్సీ రేటు 30 మిల్లీ సెకన్ల కంటే దిగువకు పడిపోనుంది. ఎల్1 చిప్ ఇందులో ఉంది. ఇది బ్లూటూత్ ఎల్ఈ ఆడియోను అందించనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి.

సోనీ ఇన్‌జోన్ బడ్స్ ధరవీటి ధరను మనదేశంలో రూ.17,990గా నిర్ణయించారు. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇవి ఇప్పటికే నవంబర్‌లో గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యాయి. వీటికి సంబంధించిన సోనీ రిటైల్ స్టోర్లు, షాప్ ఎస్‌సీ పోర్టల్, మేజర్ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు.

సోనీ ఇన్‌జోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లుసోనీ ఇన్‌జోన్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండనుంది. ఇది అవసరం లేని ఎక్స్‌టర్నల్ నాయిస్‌ను ఎలిమినేట్ చేయనుంది. యాంబియంట్ సౌండ్ మోడ్‌తో ఈ ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో 8.4 ఎంఎం డ్రైవర్స్ అందించనున్నారు. ఇవి 30 మిల్లీసెకన్ల లో లేటెన్సీని డెలివర్ చేయనున్నాయి. దీంతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగవుతుంది.

ఏఐ ఆధారిత నాయిస్ రిడక్షన్ ఫీచర్ కూడా సోనీ ఇందులో అందిస్తుంది. ఇవి సోనీ 360 స్పేషియల్ సౌండ్ ఫార్మాట్‌ను సపోర్ట్ చేయనున్నాయి. వర్చువలైజ్డ్ సరౌండ్ సౌండ్‌ను ఈ ఫార్మాట్ ద్వారా అందించనున్నారు. పెయిరింగ్ కోసం బ్లూటూత్ వీ5.3 ఫీచర్ కూడా అందించారు. ఇది 10 మీటర్ల రేంజ్‌లో ఉన్న డివైసెస్‌ను కూడా డిటెక్ట్ చేయగలదు. స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్4 రేటింగ్ కూడా ఉంది.

కాల్స్‌ను ఆన్సర్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి ఇందులో టచ్ ఎనేబుల్డ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైసెస్‌తో దీన్ని పెయిర్ చేయవచ్చు. సోనీ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ ద్వారా పెయిరింగ్ ఆన్ కానుంది. వీటిని పూర్తిగా ఛార్జింగ్ పెట్టడానికి రెండు గంటల సమయం పట్టనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 12 గంటల వరకు వీటిని ఉపయోగించవచ్చు. ఐదు నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే ఒక గంట ప్లేబ్యాక్ టైమ్ లభించనుంది. వీటి బరువు దాదాపు 13 గ్రాములుగా ఉండనుంది.

మరోవైపు శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను భారతదేశ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఉన్నాయి.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!