Sony Bravia 8 OLED Smart TV: సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 65 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజుల మోడల్స్ ఉన్నాయి. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు రన్ కానున్నాయి. ఆటో హెచ్‌డీఆర్ టోన్ మ్యాపింగ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్ ఫీచర్లు కూడా అందించారు. 4కే రిజల్యూషన్‌తో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వరకు ఇవి ఆఫర్ చేయనున్నాయి.హెచ్‌డీఆర్, హెచ్ఎల్‌జీ, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు అందించారు. యాపిల్ ఎయిర్ ప్లేను సపోర్ట్ చేసే ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.


సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర (Sony Bravia 8 OLED Price in India)
సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ సిరీస్‌లో 55 అంగుళాల మోడల్ ధరను రూ.2,19,990గా నిర్ణయించారు. ఇందులో 65 అంగుళాల వెర్షన్ ధర రూ.3,14,990గా ఉంది. సోనీ సెంటర్లు, మేజర్ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 4కే ప్యానెల్‌ను ఈ టీవీల్లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10, డాల్బీ విజన్, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది. ఏఐ ఆధారిత ఎక్స్ఆర్ ఇమేజ్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఎక్స్ఆర్ 4కే అప్‌స్కేలింగ్ టెక్నాలజీని ఈ టీవీలో చూడవచ్చు. 2కే సిగ్నల్స్‌ని ఇది 4కే సిగ్నల్స్ దాకా తీసుకెళ్తుందని తెలుస్తోంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్, డీటీఎస్ డిజిటల్ సరౌండ్ ఫీచర్లను సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ సిరీస్ సపోర్ట్ చేయనుంది. సోనీ అకౌస్టిక్ సర్ఫేస్ ఆడియో ఫీచర్‌ను కూడా అందించారు. సోనీ పిక్చర్స్ మూవీస్‌ లైబ్రరీని అందించే సోనీ పిక్చర్స్ కోర్ అనే సర్వీస్ ఇందులో చూడవచ్చు. యాపిల్ ఎయిర్‌ప్లే, హోం కిట్‌లకు కూడా ఇది కంపాటిబుల్ డివైస్. నాలుగు హెచ్‌డీఎంఐ ఇన్‌పుట్స్, రెండు యూఎస్‌బీ పోర్టులు, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ కూడా ఇందులో ఉన్నాయి.


గేమర్స్ కోసం ఆటో హెచ్‌డీఆర్ టోన్ మ్యాపింగ్ ఫీచర్‌ను సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ సిరీస్‌లో ప్రత్యేకంగా అందించారు. దీని ద్వారా హెచ్‌డీఆర్ సెట్టింగ్స్‌ను ఇన్‌స్టంట్‌గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఈ టీవీలు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా ఇందులో ఉంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. దీని ద్వారా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండే యాప్స్, గేమ్స్, సినిమాలు, టీవీ ఎపిసోడ్లను యూజర్లు యాక్సెస్ చేయవచ్చు. వాయిస్ కమాండ్స్‌ను కూడా ఈ రిమోట్ సపోర్ట్ చేస్తుంది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే