దేశంలో విరిగా లభించే ప్రకృతి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రజలను కేంద్ర ప్రభుత్వం సమాయత్తం చేస్తున్నది. ఇందులో భాగంగానే పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. సూర్యరశ్మిని ఉపయోగించి ఎవరికి వారు విద్యుత్ తయారు చేసుకునేలా సోలార్  ప్యానెల్ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద వినియోగదారుల ఇండ్లు, కార్యాలయాల మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా గృహ, కార్యాలయ అవసరాలకు సరిపడా కరెంటు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో కరెంటు బిల్లులు చెల్లించే అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాలలోని విద్యుత్  పంపిణీ సంస్థలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకునేలా విద్యుత్ సంస్థలు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి.  


25 ఏళ్ల పాటు నో కరెంటు బిల్ టెన్షన్


సోలార్ ప్యానెల్ సబ్సిడీ పథకం ద్వారా  వినియోగదారులు తొలుత కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ప్రారంభంలో 5 నుంచి  6 సంవత్సరాలలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ససుమారు 25 ఏండ్ల వరకు ఉచితంగా విద్యుత్ ను పొందే అవకాశం ఉంటుంది. 


సోలార్ రూప్ టాప్  ప్రయోజనాలు


సోలార్ రూఫ్ టాప్ పథకం ప్రకారం వినియోగదారుల ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్యానెల్లు 25 సంవత్సరాలు పని  చేస్తాయి. పవర్ కట్ సమస్య  ఉండదు. సౌరశక్తి గ్రీన్ ఎనర్జీ. కాలుష్యాన్ని కలిగించదు. పర్యావరణ హితంగా విద్యుత్ తయారు చేసుకోవచ్చు. 


ప్రభుత్వ సబ్సిడీ ఎంతంటే?


భారత ప్రభుత్వం కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా సోలార్ ప్యానెల్ పథకం కింద..  సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునేందుకు  వినియోగదారులకు సబ్సిడీ ఇస్తుంది. 3 kW సామర్థ్యం కలిగిన ప్లాంట్ల ఏర్పాటుకు 40 శాతం సబ్సిడీ, 3 kW నుంచి 10 kW సామర్థ్యం వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఉదాహరణకు మీరు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే దాదాపు రూ. 1.2 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.  40% సబ్సిడీ తర్వాత  సుమారు 48 వేల రూపాయలు సబ్సీడీ ఉంటుంది. 72 వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సోలార్ ప్యానెళ్లను అమర్చే ముందు మీ ఇంట్లో ఎంత విద్యుత్తు వినియోస్తారో తెలుసుకొని, అందుకు సరిపోయే విధంగా ప్యానెల్లను అమర్చుకుంటే మంచిది.


సోలార్ ప్యానెల్ పథకం  కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే?


సోలార్ రూప్ టాప్ పథకం ద్వారా ప్రయోజనం పొందాలి అనుకునే వాళ్లు సమీపంలోని విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మీరు సోలార్ రూఫ్‌టాప్ సబ్సిడీ స్కీమ్‌కి సంబంధించిన ఇతర సమాచారాన్ని పొందాలనుకుంటే  అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించాలి. 


⦿ ముందుగా solarrooftop.gov.in కి వెళ్లాలి.


⦿ సోలార్ రూఫ్‌ టాప్ ఎంపికపై క్లిక్ చేయండి.


⦿ రాష్ట్రాన్ని ఎంచుకోని.. ఫామ్ నింపాలి.


⦿ ఆ తర్వాత నింపిన ఫామ్ అప్ లోడ్ చేయాలి.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!