జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్ టర్నల్) భర్తీకి సెప్టెంబరు 4న నిర్వహించనున్న ప్రిలిమినరీ రాతపరీక్ష కోసం 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. జేఈ పోస్టులకు మొత్తం 1.02 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సరైన అర్హతలున్న 98,880 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను సంస్థ వెబ్‌లింక్‌ను ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు లేదా మొబైల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సెప్టెంబరు 4న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో ప్రధాన పరీక్ష, ఆ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Junior Assistant Grade-II (External) Hall Ticket Download
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 177 జూనియర్ అసిస్టెంట్(గ్రేడ్–2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ, డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు చేసిన అభ్యర్థుల నుంచి జూన్ 20 నుంచి జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల) అభ్యర్థులతో మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడు కోటా కింద (తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.
Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడాలో సూపర్‌వైజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
పరీక్ష విధానం ఇలా..
రాతపరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్-20 ప్రశ్నలు, జనరల్ స్టడీస్-15 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్-20 ప్రశ్నలు, హిస్టరీ-కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఇండియా-15 ప్రశ్నలు అడుగుతారు.
ప్రిపరేషన్ విధానం ఇలా..
- సింగరేణిలో ఉద్యోగాలు పొందడానికి ప్రణాళిక బద్థంగా రాత పరీక్షకు ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాదించవచ్చు.
- మునుపటి పత్రాలను అధ్యయనం చేయాలి. అందులో వచ్చిన వివిధ అంశాలను, ముఖ్యమైన టాపిక్స్ సేకరించాలి. ఏ టాపిక్‌కు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో, ఎన్ని మార్కులు వాటికి కేటాయిస్తున్నారో అంచనా వెయ్యాలి. ముఖ్యమైన వాటిని ముందు వరుసలో తీసుకొని, వాటిని మాత్రమే ముందుగా చదువుకోవాలి.
- ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏ ప్రశ్నలైన సరే, పదే పదే చదువుకోవాలి.
- సింగరేణి మరియు దాని ఏర్పాటుకు గల సమాచారం గురించి పూర్తి అవగాహన ఉండాలి.
- అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్‌తో పాటు, కరెంట్ అఫ్ఫైర్స్ మీద కూడా అవగాహన ఉండాలి.
- గత 6 నెలల కరెంట్ అఫైర్స్ పైన అవగాహన ఉంటే సరిపోతుంది.
- ఆప్టిట్యూడ్, రీజనింగ్, మరియు ఇంగ్లిష్ పైన పట్టు ఉండాలి. వీటి కోసం ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి.
- ఇదివరకే తెలంగాణ గ్రూప్స్‌కి ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఆ పరీక్ష ప్రేపరేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...