చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ తాజాగా OnePlus 11 5G ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 2k రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలైంది.  అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్‌లలో ఒకటైన Qualcomm Snapdragon 8 Generation 2 చిప్, స్పీడ్ RAM ను కలిగి ఉంది. హాసెల్‌బ్లాడ్ కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ,  OxygenOS 13తో రన్ అవుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ  రూ. 56,999గా నిర్ణయించింది.  ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ కు గట్టి పోటీనిచ్చే ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


Google Pixel 7- ధర: రూ. 59,999


Google Pixel 7 స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. టెన్సర్ G2 చిప్, సింగిల్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ను కలిగి ఉంది. వన్‌ప్లస్ 11తో పోల్చితే ఇందులో ట్రాన్స్‌ క్రిప్షన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. వెనుక కెమెరా బార్ కారణంగా దీని కాంపాక్ట్ డిజైన్ భిన్నంగా ఉంటుంది. ఇది IP68 రేటింగ్‌తో ముందు, వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో వస్తుంది. దీని 4,355mAh బ్యాటరీ OnePlus 11లోని 5,000mAh కంటే చిన్నది.  అయితే, ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తోంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు అద్భుతంగా ఉంటాయి.   


iQoo 11- ధర: రూ. 59,999


OnePlus 11 తాజాగా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2తో వచ్చింది. కానీ,  iQoo 11 ఎప్పుడో వచ్చింది. దీని డిజైన్  OnePlus 11కి మించి ఆకట్టుకుంటుంది.  వెనుకవైపు ఉన్న BMW రంగు చారలు,  స్లాబీ కెమెరా యూనిట్ చక్కటి లుక్ అందిస్తాయి. ఈ ఫోన్ అసాధారణమైన పనితీరును కలిగి ఉంటుంది.  OnePlus 11తో పోలిస్తే ఫోన్ వేగవంతమైన ఛార్జింగ్‌తో వస్తుంది.  OnePlus 11 100W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు వస్తుంది.  iQoo 11 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. వెనుక ట్రిపుల్ కెమెరా యూనిట్‌లోని సెకండరీ కెమెరాలు- 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 13-మెగాపిక్సెల్ టెలి-పోర్ట్రెయిట్ కెమెరాలను కలిగి ఉంటుంది.   


Xiaomi 12 ప్రో- ధర: రూ. 55,999


Xiaomi ప్రీమియం సెగ్మెంట్‌లో  Xiaomi 12 ప్రో చాలా శక్తివంతమైన స్పెక్స్‌తో వస్తుంది.  ఇది OnePlus యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ కు గట్టి పోటీ ఇస్తుంది.  Xiaomi 12 Pro అన్ని రకాలుగు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.  120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో  6.73-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.  1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందించే OnePlus 11తో పోలిస్తే కొంచెం ఎక్కువ 1,500 నిట్స్ పీక్ బ్రైట్‌ నెస్‌తో వస్తుంది.  క్వాడ్ స్పీకర్లు ఉండటం ద్వారా మల్టీమీడియా వినయోగదారులకు చక్కటి అనుభూతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా  50-మెగాపిక్సెల్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. OnePlus 11తో పోల్చితే మరింత శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. Xiaomi 12 ప్రోలోని 4,600 mAh బ్యాటరీతో పోలిస్తే OnePlus 1.. 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 120 W ఛార్జింగ్ కు సపోర్టు చేస్తోంది.    .


Motorola ఎడ్జ్ 30 అల్ట్రా- ధర: రూ. 54,999


ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌తో వస్తోంది.  6.67-అంగుళాల పూర్తి HD+ పోలెడ్ డిస్‌ప్లేతో అద్భుతమైన 144 Hz రిఫ్రెష్ రేట్‌ ను కలిగి ఉంటుంది. 200-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది.  వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 12-మెగాపిక్సెల్ టెలిఫోటో/పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి,  125W టర్బో ఛార్జింగ్,  50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 4610 mAh బ్యాటరీని కలిగి ఉంది.


Samsung Galaxy S22- ధర: రూ. 57,999


ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో  6.1-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వస్తుంది.  అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.  వన్‌ప్లస్ 11 లో లేని ఫీచర్ ఇందులో ఉంది. అదే IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ ను కలిగి ఉంది.  వన్‌ప్లస్ 11 తో పోల్చితే గెలాక్సీ ఎస్ 22 మరింత ధృడంగా ఉంటుంది.  


iPhone 13-  ధర: రూ. 61,900


OnePlus 11కి గట్టి పోటీ ఇచ్చే మరో ఫోన్ iPhone 13. డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరాలు, సాఫ్ట్‌ వేర్ అన్నీ కలిసి చక్కటి, మృదువైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తాయి. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక భాగంలో రెండు 12-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో వస్తుంది.  


Read Also: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!