Semiconductor Plant in Uttar Pradesh: మోదీ ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్‌లోని జెవర్‌లో భారతదేశంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇది భారతదేశంలో ఆరో సెమీకండక్టర్ యూనిట్ అవుతుంది. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్రకేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, వీటిలో ఒక యూనిట్‌లో ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు.
అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే... 'భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్ కింద ఇప్పటికే 5 సెమీకండక్టర్ యూనిట్లకు అనుమతి లభించింది. అక్కడ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో ఒక యూనిట్‌లో ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అదే సందర్భంగా మరో సూపర్-అడ్వాన్స్డ్ యూనిట్‌కు అనుమతి లభించింది. ఇది HCL , ఫాక్స్‌కాన్ సంయుక్త ప్రాజెక్టు.'
2000 మందికి ఉద్యోగాలు
జెవర్‌లో భారతదేశంలో ఆరవ సెమీకండక్టర్ యూనిట్‌కు అనుమతి లభించడం వల్ల 2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి అన్నారు. ఆయన మాట్లాడుతూ..."సెమీ కండక్టర్ యూనిట్‌లో 3706 కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటుంది. ఇక్కడ ప్రతి నెలా 3.6 కోట్ల డిస్ప్లే డ్రైవర్ చిప్‌లు తయారవుతాయి. 2027 నుంచి దీని ఉత్పత్తి ప్రారంభమవుతుంది. HCL-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ ప్లాంట్‌లో ప్రతి నెలా 20,000 వేఫర్లను తయారు చేస్తారు."
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఆపరేషన్ సిందూర్ భారతదేశం బలాన్ని, నాయకత్వాన్ని, మన సైన్యం శక్తిని చూపిందని అన్నారు. "ఆపరేషన్ సిందూర్ భారతదేశం గుర్తింపు, మన సాయుధ దళాల పాత్ర, నిర్ణయాత్మక నాయకత్వం, కొత్త ఆలోచనల ఫలితాలు అన్నింటికీ ఇది ముఖ్యమైన ఉదాహరణ. ఇది నిజంగా దేశానికి గర్వకారణం. ఆపరేషన్ సిందూర్‌లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించారు. టెక్నాలజీ భారతదేశానికి చాలా పెద్ద బలాన్ని ఇస్తుంది. భవిష్యత్తు కోసం బలమైన పునాది ఏర్పరుస్తుంది." అని అన్నారు.
'తాజా డిజైన్ టెక్నాలజీపై కసరత్తు'
కేంద్రమంత్రి మాట్లాడుతూ... , "సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి డిజైన్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు డిజైన్ సంస్థలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాయి. 270 విద్యా సంస్థలు, 70 స్టార్టప్‌లలో విద్యార్థులు, ఉద్యోగులు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి తాజా డిజైన్ టెక్నాలజీపై పని చేస్తున్నారు."
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా ఏమన్నారంటే... "భారతదేశంలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సర్వర్లు, మెడికల్ పరికరాలు, పవర్ ఎలక్ట్రానిక్స్, రక్షణ పరికరాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో సెమీకండక్టర్‌ల డిమాండ్ పెరుగుతోంది, ఈ కొత్త యూనిట్ PM మోడీ ఆత్మనిర్భర్ భారత్ దృష్టికోణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది."
నిర్మాణ దశలో ఉన్న సెమీకండక్టర్ యూనిట్ల వివరాలు ఇవే
1. వేదాంత, ఫోక్స్‌కాన్ కంబైండ్ వెంచర్: ఈ యూనిట్ గుజరాత్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌లను కలిగి ఉంది.
2. మైక్రాన్ టెక్నాలజీ:- ఈ సంస్థ గుజరాత్‌లోని సనంద్‌లో ఒక సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ దశ చివరి స్టేజ్‌కు వచ్చింది. త్వరలోనే కార్యకలాపాలు ప్రాంభించే అవకాశం ఉంది. ఇది తయారీ యూనిట్ మాత్రమే కాకుండా అసంబ్లీ, టెస్టింగ్ యూనిట్.
3. టాటా గ్రూప్;- టాటా గ్రూప్‌నకు చెందిన సమీకండక్టర్ తయారీ రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తోంది. తైవాన్‌కు చెందిన పవర్ చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీన్ని కూడా గుజరాత్‌లోని ఒక ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5. హువానీ సహా ఇతర సంస్థల దరఖాస్తులు కూడా పరిశీలిస్తోంది.