Who is DGMO : పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం తీసుకున్న కఠిన చర్యలతో పాకిస్తాన్ ఆక్రోశంతో ఊగిపోయింది. ప్రతీకారం తీర్చుకునేందుకు తవిధాలుగా ్రయత్నించింది. భారత్‌లోని సైనిక స్థావరాలను, సరిహద్దుల్లోని ప్రజలను టార్గెట్ చేసుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో జమ్మూ-కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారతదేశం అధునాతన రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ ఈ దుష్ట ప్రయత్నాలను గాలిలోనే అణిచివేసింది. అన్ని డ్రోన్లను ఛేదించివేయడంతో మరోసారి భారతదేశం సిద్ధతలను ప్రపంచం మొత్తం ప్రశంసించింది. అయితే ఇదే టైంలో భారత్ మాత్రం పాకిస్థాన్ లోపలికి వెళ్లి ఉగ్రస్థావరాలు ధ్వంసం చేయడమే కాకుండా దాయాది దేశం చేసిన కుయుక్తులను ఎదుర్కొనేందుకు వైమానికి స్థావరాలపై అటాక్ చేసింది. ఇది పాకిస్థాన్‌కు చాలా నష్టాన్ని కలిగించింది.
పరిస్థితి చేయిదాటిపోతుందన్న భయంతో ప్రపంచ దేశాల సాయం కోసం పాకిస్థాన్ అభ్యర్థించింది. అయినా ఎవరి నుంచి హెల్ప్ రాకపోవడంతో కాళ్ల బేరానికి వచ్చింది. యుద్ధ విరమణకు సిద్ధమని ప్రకటించింది. దీంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ విరామం అమలులోకి వచ్చింది. రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ ఒప్పందం వెనుక భారతీయ సైన్యం DGMO అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ DGMO ఫోన్ చేసి యుద్ధ విరామణ ప్రతిపాదన చేసినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
DGMO ఎవరు, ఏమి చేస్తారు?
భారతీయ సైన్యంలో DGMO 3స్టార్ ర్యాంక్ ఉన్న సీనియర్ లెఫ్టినెంట్ జనరల్. దేశ రక్షణ విధానాన్ని అమలు చేయడం ఈ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన ప్రధాన విధి. DGMO నేరుగా ఆర్మీ చీఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల మధ్య సమన్వయాన్ని కూడా చేస్తారు.
యుద్ధ వ్యూహాలను రూపొందించడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం, శాంతి మిషన్లను పర్యవేక్షించడం, LOCలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు వాటిని దీటుగా ఎదుర్కొనే బాధ్యతల్లో వీరికి ఉంటుంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా 'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా DGMO పాకిస్తాన్ DGMOతో చర్చలు జరిపి పరిస్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించింది.
DGMO జీతం ఎంత?
DGMO జీతం కూడా దాని బాధ్యతల మాదిరిగానే అధికంగా ఉంటుంది. 7వ వేతన కమిషన్ ప్రకారం, లెఫ్టినెంట్ జనరల్ జీతం 1,82,200 నుంచి 2,24,100 వరకు ఉంటుంది. దీనితోపాటు మిలిటరీ సర్వీస్ పే, డీఏ, ఇతర భత్యాలను కలిపితే వారి మొత్తం జీతం నెలకు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అంతేకాకుండా వారికి ప్రభుత్వ నివాసం, వైద్య సదుపాయాలు, వాహనం వంటి అనేక సౌకర్యాలు కూడా అందిస్తారు.
పాకిస్థాన్ డీజీఎంవో శాలరీ ఎంత?
పాకిస్తాన్‌లో, DGMO మేజర్ జనరల్ హోదా కలిగిన అధికారి,, అతని జీతం భారత రూపాయలలో చూసుకుంటే దాదాపు 1.5 నుంచి 2 లక్షలు. ఇందులో అన్ని భత్యాలు కూడా ఉంటాయి. ఏ రకంగా చూసుకున్నా భారత్ డీజీఎంవో శాలరీలో సగం కూడా పాకిస్థాన్ డీజీఎంవోకు లేదు.