కిందటి సంవత్సరం.. ది వాల్ టీవీని తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది శాంసంగ్. ఇప్పుడు కొత్తగా దివాల్ రెండో వెర్షన్ ను తీసుకొచ్చింది. బ్రైట్ నెస్, డిస్ ప్లే పరంగా బెటర్ ఫీచర్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పాత మోడల్ ఎల్ ఈడీలతో పోలిస్తే.. ప్రస్తుత ఎల్‌ఈడీ ప్యానల్స్‌ 40 శాతం చిన్నవి. హై కాంట్రాస్ట్, మెరుగైన కలర్ యూనిఫార్మిటీని ఇస్తాయని శాంసంగ్ తెలిపింది.  ది వాల్ టీవీలో కొత్త తరం ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 


ఫీచర్లు ఇవే..


ది వాల్‌ రెండో వెర్షన్‌ 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 16కే రిజల్యూషన్‌తో 110-అంగుళాల సైజ్‌లో ఉంటుంది. ఇందులో మైక్రోఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగించారు. ఈ మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానల్స్‌తో అవసరానికి తగినట్టుగా ఈ డిస్‌ప్లేని 1000-అంగుళాల సైజ్‌కు పెంచుకోవచ్చు. 99.99 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో ఈ డిస్‌ప్లే ఉంటుంది.


అక్కడైతేనే బెటర్..


వీటిని ఎక్కువగా షాపింగ్ మాల్స్‌, కార్పొరేట్ సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు, ఆస్పత్రులు, పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ డిస్‌ప్లే.. ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వీటిని విడుదల చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. అయితే ఈ డిస్‌ప్లే ధర ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. ఇందులో హై-ఎండ్ హోమ్ థియేటర్ సెటప్ ఉంది.


ధర కోటిపైనే..!


గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన 110 అంగుళాల వెర్షన్ ధరనే $156000 సుమారు రూ.1,16,10,612గా ఉంది. 2021 మైక్రో ఎల్ఈడీ టీవీ 'ది వాల్' ధరను కంపెనీ అధికారికంగానైతే ఇంకా ప్రకటించ లేదు. కానీ దీని ధర మొదటి-జెన్ వెర్షన్ ధర రూ.కోటి.. కంటే ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. 


ఈ టీవీ గురించి కూడా తెలుకోండి


ఇండియాలో శాంసంగ్ అల్ట్రా ప్రీమియం క్యూఎల్ఈడీ టీవీ రేంజ్‌ని మనదేశంలో ఏప్రిల్ లోనే లాంచ్ చేసింది. దాని ధర రూ.99,990 నుంచి ప్రారంభం. ఇందులో బెజెల్స్ లేని డిజైన్ అందించారు. సినిమాటిక్ వ్యూయింగ్ అనుభవాన్ని ఈ టీవీలు అందిస్తాయి.


 క్యూఎల్ఈడీ నియో 8కే టీవీలు రెండు మోడళ్లలో లాంచ్ అయ్యాయి. అవే క్యూఎన్800ఏ, క్యూఎన్900ఏ. క్యూఎన్800ఏలో 65 అంగుళాలు, 75 అంగుళాల టీవీలే ఉండగా, క్యూఎన్900ఏలో 85 అంగుళాల టీవీ కూడా ఉంది. దీంతోపాటు క్యూఎన్85ఏలో 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల మోడళ్లు ఉన్నాయి. క్యూఎన్90ఏలో 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాలు, 85 అంగుళాల మోడళ్లు దొరుకుతాయి.


Also Read: Amazon Prime Sale: అమెజాన్ ప్రైమ్ డే 2021 షాపింగ్ చేయాలనుకుంటున్నారా….అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి…. 


                  enemy teaser: నీ కోసం అన్నీ తెలిసిన మిత్రుడే ప్రమాదకరమైన శత్రువు