అవును వాళ్లు పుట్టుకతోనే ఛాంపియన్స్... మనలా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ లేవు. ఆట అనేది వాళ్ల  లైఫ్‌స్టైల్‌లోనే ఉంది. పుట్టకతో వచ్చిన ఫుడ్ హాబిట్స్, శరీరం..  మణిపూర్‌ వాసులను  ఛాంపియన్లుగా చేస్తున్నాయి. 


చుట్టూ కొండలు గుట్టలు... అటవీ ప్రాంతాలు... అవే మణిపూర్‌ వాసులను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది. ఆటలు మణిపూర్ వాసుల హాబీ. వాళ్ల సంస్తృతిలోనే శ్రమ ఉంది. అందులో నుంచే ఆట పుట్టింది. వాళ్లను ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసింది. 


ఒలింపిక్స్‌ మాత్రమే కాదు.. ప్రపంచంలో వ్యక్తిగత క్రీడలు ఏం జరిగినా భారత్‌ పాల్గొంటే అందులో మణిపూర్‌ వాసులు ఉండాల్సిందే. 2020 ఒలింపిక్స్‌లో కూడా సేమ్ సీన్. ఎవరు ముందు బోణీ కొడతారా అని యావత్ దేశం ఎదురు చూస్తున్న టైంలో మీరాబాయి చాను సిల్వర్ సాధించింది. యావత్ దేశాన్నే ఆనంద సాగరంలో ముంచేసింది. క్రీడలు ప్రారంభమైన రెండో రోజే పతకాల పట్టికలో భారత్‌ పేరు నిలవడం దేశ ప్రజలు మురిసిపోతున్నారు. 


సిక్కోలు ఆడబిడ్డ కరణం మల్లీశ్వరి తర్వాత 21ఏళ్లకు ఈ విభాగంలో మెడల్ సాధించిన ఘనతను మీరాబాయి సొంతం చేసుకుంది. ఈ విజయంతో మరోసారి మణిపూర్ వాసుల క్రీడా పటిమను మరోసారి చాటింంది. 


ఇక్కడ ప్రత్యేక సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. మణిపూర్‌లో మాత్రం చాలా స్పెషల్. అక్కడ పిల్లలతో కచ్చితంగా ఆటలు ఆడిపిస్తారు. దీని కోసం ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా స్పోర్స్ట్ క్లబ్‌లు ఉన్నాయి. ఆ క్లబ్స్‌ వాళ్ల రాష్ట్ర సంస్కృతిలో భాగం. ఈ క్లబ్‌లన్నీ స్వతహాగా పని చేస్తుంటాయి. ఒక్కో క్లబ్‌ వ్యక్తిగత క్రీడలు చాలానే ప్రోత్సహిస్తుంటాయి. మణిపూర్‌  విద్యావిధానంలో కూడా క్రిడలకు ప్రత్యేక స్థఆనం ఉంటుంది. 


చైనా, అమెరికా, రష్యా మాదిరిగానే మణిపూర్‌లో కూడా చిన్న పిల్లలకు ఇష్టమైన క్రీడలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్న చిన్నారులు పెరిగి టీనేజ్ వచ్చే నాటికి నైపుణ్యం సాధిస్తారు. పతకాల వేట స్టార్ట్ చేస్తారు. అలా వచ్చిందే మీరాబాయి కూడా. ఆమె 12 ఏళ్ల వయసులోనే సాధన మొదలు పెట్టింది. ట్రైనింగ్ ఎంత్ హార్డ్‌గా ఉన్నా సాధన చేసేది. ఇలాంటి క్రమశిక్షణ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. కోచ్ చెప్పినదానికి ఎక్కడా వాళ్లు మితిమీరి మాట్లాడరు. 


పొట్టి వాళ్లే గట్టి వాళ్లను తరచూ వింటూ ఉంటాం. మణిపూర్ వాసుల విషయంలో మాత్రం ఇది నిజమే. ఎత్తు తక్కువ ఉండటం కొన్ని క్రీడలకు అడ్వాంటేజ్. వెయిట్‌ లిఫ్టింగ్‌లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి క్రీడల్లో రాణించడానికి, బలంగా తయారు అవడానికి మణిపూర్ వాసుల ఎత్తు చాలా ఉపయోగకరంగా మారుతుంది. 


మనంలో చాలా మంది బలంగా ఉండాలని అన్నం మినహా వేర్వేరు ఆహారపు అలవాట్లను అలవరుచుకుంటారు. కానీ అన్నంతోనే మణిపూర్ వాసులు దృఢంగా తయారవుతున్నారు. మణిపూర్ వాసులకు వరి అన్నం ప్రధాన ఆహారం. అన్నం త్వరగా జీర్ణమైన శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది వెయిట్‌ లిఫ్టర్లను ఛాంపియన్లుగా మారుస్తుంది. చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కూడా క్రీడాకారులు వరి అన్నం లాంటి ఆహారాన్న తీసుకుంటారు. 


ఇప్పటి వరకు వివి విభాగాల్లో భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు 


హాకీ
నీలకంఠశర్మ
సుశీలా చాను


బాక్సింగ్
మేరీ కోమ్


వెయిట్ లిఫ్టింగ్
సైఖోమ్‌ మీరాబాయి చాను
సానామాచా
కుంజారాణి
గంగ్బమ్‌ సోనియా 


జుడో
లిక్మాబం సుశీలా
లౌరెంబామ్ బ్రోజెషోరి
ఖుముజమ్ తోంబి 


ఆర్చరీ
లాయిష్రామ్ బొంబాయిలా