శాంసంగ్ ఒడిస్సీ ఆర్క్ 1000ఆర్ కర్వ్‌డ్ గేమింగ్ మానిటర్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 55 అంగుళాల 4కే డిస్‌ప్లేను అందించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మానిటర్ ఆగస్టులో లాంచ్ అయింది. ఇందులో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. 60W సౌండ్ అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. హైట్ అడ్జస్టబుల్ స్టాండ్‌ను కూడా దీంతోపాటు అందించనున్నారు.
శాంసంగ్ 55 అంగుళాల ఒడిస్సీ ఆర్క్ కర్వ్‌డ్ మానిటర్ ధర
దీని ధరను మనదేశంలో రూ.2,19,999గా నిర్ణయించారు. సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఇది లాంచ్ అయింది. శాంసంగ్ షాప్, శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 9వ తేదీ లోపు దీన్ని కొనుగోలు చేస్తే రూ.10,000 ఇన్‌స్టంట్ కార్ట్ డిస్కౌంంట్‌తో పాటు, 2 టీబీ ఎస్ఎస్‌డీ టీ7 హార్డ్ డిస్క్ ఉచితంగా అందించనున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య కొనుగోలు చేస్తే రూ.10,000 ఇన్‌స్టంట్ కార్ట్ డిస్కౌంట్‌తో పాటు, 1 టీబీ ఎస్ఎస్‌డీ టీ7 హార్డ్ డిస్క్ ఉచితంగా లభించనున్నాయి.
శాంసంగ్ 55 అంగుళాల ఒడిస్సీ ఆర్క్ కర్వ్‌డ్ మానిటర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 55 అంగుళాల 1000ఆర్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. 4కే రిజల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని యాస్పెక్ట్ రేషియో 16:9గా ఉంది. శాంసంగ్ న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ అల్ట్రాను అందించారు. క్వాంటం మినీ ఎల్ఈడీ బ్యాక్ లైటింగ్ విత్ లోకల్ డిమ్మింగ్ ఫీచర్లు ఉన్నాయి.
గేమర్స్‌కు వేరియస్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండనుంది. వినియోగదారులు దీన్ని 27 అంగుళాల డిస్‌ప్లేగా కూడా ఉపయోగించవచ్చు. 16:9, 21:9, 32:9 యాస్పెక్ట్ రేషియోలకు స్క్రీన్ స్విచ్ చేయవచ్చు. ఈ మానిటర్ కాంట్రాస్ట్ రేషియో 1,000,000:1గా ఉంది.
హైట్ అడ్జస్టబుల్ స్టాండ్ ద్వారా డిస్‌ప్లేను రొటేట్ ద్వారా చేయవచ్చు. దీని డిస్‌ప్లేను టిల్ట్ చేయవచ్చు. ఇందులో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. మొత్తంగా 60W సౌండ్ అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది. డాల్బీ అట్మాస్ ఆడియోను ఇది సపోర్ట్ చేయనుంది. నాలుగు హెచ్‌డీఎంఐ పోర్టులు కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?