Samsung Galaxy S24 Series: శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఎస్24 ప్లస్, ఎస్24 అల్ట్రా స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. జనవరి 31వ తేదీ నుంచి సేల్ కూడా జరగనుంది. శాంసంగ్ వీటి సేల్ కోసం బ్లింకిట్‌తో చేతులు కలిపింది. ఎంపిక చేసిన నగరాల్లో మీరు ఆర్డర్ చేశాక కేవలం 10 నిమిషాల్లోనే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు మీ చేతుల్లోకి వస్తాయన్న మాట.


ఈ విషయాన్ని శాంసంగ్ ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపింది. బెంగళూరు, ఢిల్లీ - ఎన్సీఆర్, ముంబై నగరాల్లో శాంసంగ్ ఎస్24, శాంసంగ్ ఎస్24 ప్లస్, శాంసంగ్ ఎస్24 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే పొందవచ్చని బ్లింకిట్ తెలిపింది. మిగతా రిటైలర్ల నుంచి ఆర్డర్ చేస్తే కనీసం ఒక రోజు సమయం పడుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై పని చేయనుంది. మిగతా రెండూ మోడల్స్‌ శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌పై రన్ కానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర ఎంత? (Samsung Galaxy S24 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999గా నిర్ణయించారు. యాంబర్ ఎల్లో, కోబాల్ట్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24ను కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ ధర ఎంత? (Samsung Galaxy S24 Plus Price in India)
ఇందులో కూడా రెండు వేరియంట్లే అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,09,999గా ఉంది. కోబాల్ట్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ కనిపించనుంది. శాంసంగ్ స్టోర్‌కు వెళ్లి కొనాలంటే మాత్రం జేడ్ గ్రీన్, సాఫైర్ బ్లూ కలర్ ఆప్షన్లు అదనంగా అందుబాటులో ఉండనున్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ధర ఎంత? (Samsung Galaxy S24 Ultra Price in India)
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కొనాలంటే రూ.1,29,999 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక మిడ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,999గానూ, టాప్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,999గానూ నిర్ణయించారు. టైటానియం గ్రే, టైటానియం గ్రీన్, టైటానియం ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనేయచ్చు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!