Chaitanya Jonnalagadda React on Niharika Comments: విడాకులపై మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఫస్ట్‌టైం తన విడాకులపై నోరు విప్పింది ఆమె. ఎవరూ విడిపోవాలని పెళ్లి చేసుకోరని, కానీ బలవంతంగా కూడా కలిసి ఉండలేరు కదా? అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. విడాకులు తర్వాత చాలా బాధపడ్డానంది. తనది లవ్ మ్యారేజ్ కాదని, పెద్ద కుదిర్చిన వివాహమే అని స్పష్టం చేసింది. కానీ, కొన్ని విషయాల్లో వర్కౌట్ కాక విడిపోవాల్సి వచ్చిందని చెప్పింది. అందరిలాగే తాను పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ ఎప్పుడు ఎదుటివ్యక్తిపై ఆధారపడి జీవించడం సాధ్యం కాదంది, ఇక పెళ్లితో ఓ గుణపాఠం నేర్చుకున్నానంది.
అందరూ మన తల్లిదండ్రుల్లా ఉండరని, వారిలా అస్సలు ప్రేమగా చూసుకోరంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అందుకే పెళ్లికి ముందే ఒకరిని ఒకరు బాగా తెలుసుకోవాలని, అది తెలియకుండా మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదంటూ ఊహించని కామెంట్స్ చేసింది. అయితే నిహారిక వీడియోను సెలబ్రిటీ యాంకర్ నిఖిల్ తన ఇన్‌స్టా పేజీ వేదికగా షేర్ చేశాడు. దీంతో నిహారిక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె కామెంట్స్ విన్న కొందరు చైతన్యను నిందిస్తున్నారు. దీంతో దీనిపై తాజాగా నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు. ఈ వీడియోపై కామెంట్ చేస్తూ నిహారిక కామెంట్స్‌కి ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు.
ఒకవైపు నుంచే జరిగింది చూపించడం కరెక్ట్ కాదు
"హాయ్ అఖిల్.. ఈమధ్య కాలంలో నిహారికపై జరుగుతున్న ప్రచారం, నెగిటివిటీని దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అవును.. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్పచారాన్ని ఎదుర్కొవడం అంత సులభం కాదనే విషయం నాకూ తెలుసు. కానీ దాని బాధితులను కూడా ఇందులోకి పరోక్షంగా ట్యాగ్ చేయడం.. అందుకు ఇలాంటి ప్లాట్ ఫామ్స్ ఉపయోగించడం కరెక్ట్ కాదు. ఇలాంటి మానేయాలి. ఇలా జరగడం ఇది రెండోసారి. ఏదైన సంఘటన జరిగితే దానివల్ల (విడాకులు) వల్ల రెండు వైపుల ఒకే విధమైన బాధ, కష్టం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాల వల్ల ఎదుటి వ్యక్తికి ఇంకా బాధ, నొప్పి కలిగించడమే.
నిజం ఏంటనేది రెండువైపులా తెలుసుకోవాలి, చూపించాలి. ఒకవైపు నుంచే విని జడ్జీ చేయడం సరికాదు. విడాకులు తర్వాత కలిగే నొప్పి, బాధ గురించి, దాని నుంచి ఎలా బయటపడ్డారనే విషయంపై మాట్లాడుకుంటే బాగుంటుంది. అది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేసేటప్పుడు ఈ సంఘటనతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏం తెలియకుడా ఒకవైపు నుంచి చూసి జడ్జీ చేసి కామెంట్స్ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫాం ఉపయోగించి ప్రజలకు ఒకవైపు నుంచే జరిగింది చెప్పడం కూడా అంతే తప్పు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను" అంటూ రాసుకొచ్చాడు.
Also Read: తెలుగు ఆడియన్స్‌కు అయలాన్ షాక్, ఇదీ రిలీజ్ ఆగడానికి అసలు కారణం!