Ayalaan Telugu Version Release Halted: సంక్రాంతికి తమిళనాడులో విడుదలై, ఘన విజయం సాధించిన సినిమా 'అయలాన్'. తమిళంతో పాటు తెలుగులో కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్స్ నాలుగు ఉండటంతో వాయిదా వేశారు. రెండు వారాలు ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అంతా సవ్యంగా జరిగితే రిపబ్లిక్ డే కానుకగా తెలుగులో ఇవాళ (శుక్రవారం, జనవరి 26న) విడుదల కావాలి. కానీ, విడుదల కాలేదు. 


మార్నింగ్ షోస్ క్యాన్సిల్...
బుకింగ్స్ ఆపేసిన యాప్స్!
'అయలాన్' తెలుగు వెర్షన్ శుక్రవారం ఏపీ, తెలంగాణలో విడుదల కాలేదు. తమిళ్ వెర్షన్ మాత్రం విడుదల అయ్యింది. దాంతో మార్నింగ్ టికెట్స్ బుక్ చేసుకున్న ప్రేక్షకులు టెక్నికల్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిందేమో... నెక్స్ట్ షోకి వెళ్లవచ్చని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా షోలు పడలేదు. మార్నింగ్, మ్యాట్నీ షోస్ క్యాన్సిల్ కావడమే కాదు... పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలు 'అయలాన్' షోస్ షెడ్యూల్ చేయడం మానేశాయి. బుక్ మై షో, పేటీఎం వంటి టికెట్ బుకింగ్ యాప్స్ సైతం షోలను తొలగిస్తున్నారు. 


తెలుగు వెర్షన్ ఆగడం వెనుక కారణం ఏమిటి?
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'అయలాన్'ను గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటించిన 'వరుణ్ డాక్టర్' చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. అంతకు ముందు ఆ హీరో 'శక్తి'ని కూడా తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పుడు అశ్విన్ బాబు హీరోగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో 'అయలాన్'ను భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తే... తమిళ నిర్మాతల లీగల్ సమస్యలు మహేశ్వర్ రెడ్డికి షాక్ ఇచ్చాయి.


Also Readచిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరు... ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరెవరికి ఆ అవార్డు వచ్చిందో తెలుసా?


తమిళనాడులో 'అయలాన్' విడుదల సాఫీగా జరగలేదు. నిర్మాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూస్ కారణంగా లేటుగా షోలు పడ్డాయి. అయితే... అక్కడ విడుదల కావడంతో తెలుగుకు ఏ సమస్య ఉండదని భావించారు. కానీ, అలా జరగలేదు. తమిళంలో చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన కేజేఆర్ స్టూడియోస్ అధినేత కోటపాడి జె రాజేష్ లీగల్ ప్రాబ్లమ్స్ తెలుగు విడుదల మీద పడ్డాయి. శుక్రవారం అయితే థియేటర్లలో షోలు పడే అవకాశం లేదు. ఈ రోజు ఏమైనా సెటిల్మెంట్ జరిగితే శనివారం విడుదల అవుతుంది. లేదంటే ఆగవచ్చు.


'అయలాన్' గనుక ఇవాళ విడుదలైతే మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. జనవరి 26న హాలిడే కావడం, తమిళనాడులో మంచి టాక్ రావడంతో చాలా మంది సినిమాకు వెళ్లాలని అనుకున్నారు. వాళ్ళ ఆశల మీద లీగల్ సమస్యలు నీళ్లు చల్లింది. 'అయలాన్' సినిమాలో శివకార్తికేయన్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ శరద్ కేల్కర్ విలన్ రోల్ చేశారు. యోగిబాబు, సతీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 


Also Readపద్మ విభూషణ్‌కు ముందు చిరంజీవికి వచ్చిన అవార్డులు, లభించిన సత్కారాలు తెలుసా?