Boyapati Sreenu Next Movie: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తర్వాతి సినిమాకు రెడీ అయ్యారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ భారీ సినిమాను నిర్మించనున్నారు. అల్లు అరవింద్, బోయపాటి శ్రీనులది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఇదే కాంబోలో 2016 సంవత్సరంలో ‘సరైనోడు’ సినిమా కూడా తెరకెక్కింది. ఈ సినిమా అల్లు అర్జున్‌కి మాస్ ఇమేజ్‌ను తీసుకురావడంతో పాటు భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సమయానికి బోయపాటి, అల్లు అర్జున్ కెరీర్లలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.






అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. బాలకృష్ణ, సూర్య, అల్లు అర్జున్... ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో బోయపాటికి ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది. బాలకృష్ణ ప్రస్తుతం #NBK109 సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ఫ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా అయ్యాక అట్లీతో సినిమా చేస్తారని టాక్ నడుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మరి బోయపాటికి ఛాన్స్ దొరుకుతుందో లేదో. సూర్య ఇటీవలే ‘కంగువా’ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. వెట్రిమారన్‌తో చేయాల్సిన ‘వాడివాసల్’ ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉంది.


బోయపాటి 2021లో ‘అఖండ’తో భారీ హిట్ అందుకున్నారు. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఆ తర్వాత రామ్‌తో ‘స్కంద’ తీశారు. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు సాధించింది. అప్పటి నుంచి బోయపాటి నెక్స్ట్ సినిమా మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.


నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కూడా బోయపాటి, బాలయ్య సినిమాతోనే ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. బాలయ్య నటిస్తున్న అఖండ సీక్వెల్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని సమాచారం. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కి టాలీవుడ్ లో ఉండే క్రేజే వేరు.


ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. దీంతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాయి. మోక్షజ్ఞ కోసం బోయపాటి 'అఖండ 2' లో ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌ని డిజైన్ చేశారని సమాచారం. సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ చాలా సర్ప్రైజింగ్ గా ఉండేలా బోయపాటి ప్లాన్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. 'అఖండ 2' మోక్షజ్ఞకి ది బెస్ట్ డెబ్యూ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.