Samsung Galaxy F23 5G Launch: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 8వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్-సిరీస్‌లో రెండు ఫీచర్లను కంపెనీ మొట్టమొదటిసారి అందిస్తుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే కూడా ఇందులో అందించనున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉండనుంది.


దీనికి సంబంధించిన ప్రెస్‌నోట్‌ను కూడా శాంసంగ్ విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ లాంచ్ చేసిన ప్రత్యేకమైన మైక్రోసైట్ ప్రకారం... ఈ ఫోన్ మార్చి 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇందులో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉండనుంది.వెనకవైపు మూడు కెమెరాలను శాంసంగ్ అందించనుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉండనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ధర (అంచనా)
గతంలో వచ్చిన లీకుల ప్రకారం... ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.20 వేలలోపే ఉండనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
శాంసంగ్ ఈ ఫోన్ గురించి ఇతర వివరాలను వెల్లడించలేదు. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు మాత్రం గతంలోనే లీకయ్యాయి. వీటిని బట్టి ఇందులో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750 5జీ ప్రాసెసర్ కూడా ఇందులో ఉండనున్నాయి. 6 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో శాంసంగ్ అందిస్తుందని తెలుస్తోంది.


గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22కి తర్వాతి మోడల్‌గా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ లాంచ్ కానుంది. ఇందులో 6.4 అంగుళాల హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!