Samsung New Phone: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ చవకైన ఎఫ్-సిరీస్‌లో మార్చిలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందించింది. మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ధర ఎంత?
మొదట ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. ఇప్పుడు లాంచ్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే రూ.15,999 పెట్టాల్సిందే. యాష్ బ్లాక్, గ్రూవీ వయొలెట్, జాజీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ అందుబాటులో ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందించనున్నారు. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఇందులో అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ కూడా ఉంది.


8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా  1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ పని చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 


ఇక కెమెరాల విషయానికి వస్తే... శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా శాంసంగ్ అందించింది.  సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 


5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, గైరో సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 217 గ్రాములుగా ఉంది.



Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు