Samsung Galaxy A56: స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ మూడు కొత్త A సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసింది. శాంసంగ్ Galaxy A 26, Galaxy A36లతో పాటు Galaxy A56 లను 6 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌, పలు AI ఫీచర్లతో మోడల్స్ తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలలో మార్కెట్లోకి వస్తున్న మోడల్స్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలిలా ఉన్నాయి. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇష్టపడే, నమ్మకం ఉంచే బ్రాండ్లలో శాంసంగ్ ఒకటి. మార్కెట్లోకి తీసుకొస్తున్న శాంసంగ్ మూడు కొత్త మోడల్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వాటి ధరలు పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.  


Samung Galaxy A56 స్పెసిఫికేషన్స్


శాంసంగ్ లో Galaxy A56, Galaxy A36, A26 అన్నీ 120Hz రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేతో లాంచ్ అయ్యాయి. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 1200 nits కాగా, మొత్తం 3 వేరియంట్‌లు IP67 రేటింగ్‌తో వచ్చాయి. ఈ మూడు మోడల్స్ మధ్య ఉన్న మరో సారూప్యత ఏమిటంటే Android 15 ఓఎస్, OneUI 7.0పై రన్ అవుతాయి. 6 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్ ప్రామిస్ చేసింది. 


గెలాక్సీ A56 Exynos 1580 ప్రాసెసర్, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ వర్క్ కోసం AMD Xclipse 540 GPU యాడ్ చేశారు. ఇది 8/12GB RAM వేరియంట్,  128/256GB స్టోరేజీలతో అందుబాటులోకి వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 MP, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 5MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు,  వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా ఫిక్స్ చేసింది శాంసంగ్.


శాంసంగ్ గెలాక్సీ A56, A36 డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో రాగా, A26 సైడ్ మౌంటెడ్ స్కానర్‌తో వస్తోంది. ఈ 3 ఫోన్‌లు 5G, 4G VolTE, బ్లూటూత్ 5.3, GPS + GLONASS, NFC ఫీచర్లు సపోర్ట్ చేస్తాయి. 3 ఏ సిరీస్ ఫోన్‌లు 5,000mAh బ్యాటరీ కలిగి ఉన్నాయి. A56, A36 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ తో రాగా..  A26 25W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.


గెలాక్సీ A56, A36, గెలాక్సీ A26 ధరలు:
శాంసంగ్ గెలాక్సీ A56 లైట్‌గ్రే, గ్రాఫైట్, ఆలివ్, పింక్ నాలుగు రంగులలో లభిస్తుంది. ఇందులో 8GB RAM/128GB వేరియంట్ ధర 499 డాలర్లు (మన కరెన్సీలో దాదాపు ₹44,000). 8GB RAM/ 256 GB వేరియంట్ ధర 549 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹48,000). A36 లావెండర్, బ్లాక్, వైట్, లైమ్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది, శాంసంగ్ గెలాక్సీ A26 పింక్, నలుపు, తెలుపు, పుదీనా రంగులలో వస్తుంది.



A36 మోడల్స్ 6GB RAM /128GB స్టోరేజ్ మోడల్ ధర 399 డాలర్లు. 8GB RAM/ 256GB స్టోరేజ్ వేరియంట్‌ 415 డార్లు. గెలాక్సీ A26లో 6GB RAM/ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 299 డాలర్లు, కాగా, 8GB RAM/ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 375 డాలర్లు అని వివరాలు వెల్లడయ్యాయి. సోమవారం నుంచి భారత మార్కెట్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి.


Also Read: Smartphones: స్మార్ట్‌ఫోన్ కొనబోతున్నారా? కొంచెం ఆగండి, మార్చిలో మిర్చి లాంటి మోడళ్లు వస్తున్నాయ్‌