శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ అమెరికాలో విడుదలైంది. శాంసంగ్ లాంచ్ చేసిన అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ ధర
దీని ధరను అమెరికాలో 249.99 డాలర్లుగా(సుమారు రూ.18,700) నిర్ణయించారు. అమెరికాలో డిసెంబర్ 3వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఒకవేళ లాంచ్ అయితే మాత్రం దీని ధర రూ.15 వేలలోపే ఉండవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను ఇందులో అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. సబ్6 5జీ ఇందులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
వైఫై, ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్లను కూడా ఇందులో శాంసంగ్ అందించారు. ఈ చవకైన 5జీ ఫోన్ మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 195 గ్రాములుగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో శాంసంగ్ 5జీ ఫోన్లలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదే.
Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!