Samsung Galaxy A03: శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ కొత్త శాంసంగ్ ఫోన్ గతేడాది నవంబర్‌లో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. మోటొరోలా మోటో ఈ40, రియల్‌మీ సీ25వై, టెక్నో స్పార్క్ 8సీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ధర (Samsung Galaxy A03 Price)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,499గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్.కాం, రిటైల్ స్టోర్లు, ఆన్‌లైన్ పోర్టళ్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్పెసిఫికేషన్లు (Samsung Galaxy A03 Specifications)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ కోర్ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.