శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ మనదేశంలో సోమవారం లాంచ్ అయింది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించారు. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల పీఎల్ఎస్ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ వీ4.2, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్, గ్లోనాస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. పవర్, వాల్యూమ్ బటన్లు ఫోన్‌కు కుడివైపు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 211 గ్రాములుగా ఉంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!