Redmi Note 13 Pro 5G Sale: రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్ల సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 13 5జీ (Redmi Note 13 5G), రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G), రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ (Redmi Note 13 Pro Plus 5G) ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ల సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా రెడ్‌మీ నోట్ 13 5జీని కొనుగోలు చేస్తే రూ.1,000, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్‌లపై రూ.2,000 తగ్గింపు అందించనున్నారు.


రెడ్‌మీ నోట్ 13 5జీ ధర (Redmi Note 13 5G Price)
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.21,999గా ఉంది. ఆర్కిటిక్ వైట్, ప్రిజం గోల్డ్, స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రెడ్‌మీ నోట్ 13 5జీ అందుబాటులో ఉంది.


రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ధర (Redmi Note 13 Pro 5G)
ఈ ఫోన్ కూడా మూడు వేరియంట్లలోనే అందుబాటులో ఉంది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.29,999గా నిర్ణయించారు. ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ధర (Redmi Note 13 Pro Plus 5G)
మూడు ఫోన్లలో టాప్ ఎండ్ స్మార్ట్ ఫోన్ అయిన రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ ధర రూ.31,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.33,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ కలర్ ఆప్షన్లలో రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ అందుబాటులో ఉంది.


రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్‌తో పాటు వివో ఎక్స్100 సిరీస్ కూడా మార్కెట్లోకి వచ్చింది. వీటికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. కానీ ఈ రెండు ఫోన్లూ ఒకదానికి ఒకటి ఏమాత్రం పోటీ కాదు. ఎందుకంటే రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్... మిడ్ రేంజ్ నుంచి మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఉన్నాయి. వివో ఎక్స్100 సిరీస్ పూర్తిగా హైఎండ్ స్మార్ట్ ఫోన్లు. 


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!