Realme V25: రియల్‌మీ వీ25 స్మార్ట్ ఫోన్ చైనాలో మార్చి 3వ తేదీన లాంచ్ కావడానికి సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రియల్‌మీ వి-సిరీస్ ఫోన్లు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది.


ఫోన్ వెనకవైపు కెమెరా మాడ్యూల్, స్మార్ట్ ఫోన్ డిజైన్ కూడా ఇందులో రివీల్ అయ్యాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. రియల్‌మీ వీ15 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో పంచ్ హోల్ తరహా డిజైన్‌ను అందించారు.


మనదేశ కాలమానం ప్రకారం... ఉదయం 11:30 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్ పోస్టర్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టెనా సర్టిఫికేషన్ సైట్లో ఈ ఫోన్ RMX3475 మోడల్ నంబర్‌తో కనిపించింది.


12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉండనున్నాయి.


2.2 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. రియల్‌మీ వీ15 5జీ గతేడాది చైనాలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8000 ప్రాసెసర్‌ను అందించారు.