రియల్‌మీ క్యూ3ఎస్ అక్టోబర్ 19వ తేదీన లాంచ్ కానుంది. రియల్‌మీ జీటీ నియో 2టీతో పాటు ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పలు స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఇందులో 144 హెర్ట్జ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉండనుంది. హెచ్‌డీఆర్10 సపోర్ట్‌ను కూడా ఇందులో అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ గత నెలలోనే గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఈ టెనా లిస్టింగ్ ప్రకారం.. దీని మోడల్ నంబర్ రియల్‌మీ క్యూ3ఎస్‌గా ఉండనుంది.


అక్టోబర్ 19వ తేదీన ఉదయం 11:30 గంటలకు రియల్‌మీ క్యూ3ఎస్ లాంచ్ కానుంది. దీని లాంచ్ డేట్ పోస్ట్ చూస్తే బ్లూ, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ 5జీని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఫోన్ కూడా 5జీ ఫోన్ అయ్యే అవకాశం ఉంది.


30 హెర్ట్జ్, 48 హెర్ట్జ్, 60 హెర్ట్జ్, 90 హెర్ట్జ్, 120 హెర్ట్జ్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మీ స్మార్ట్ ఫోన్ యూసేజ్ ప్రకారం.. స్మూత్, పవర్ సేవింగ్ మోడ్స్ మధ్య వీటిని స్విచ్ చేసుకోవచ్చు. డీసీఐ-పీ3 పవర్ గాముట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.


ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు రియల్‌మీ ప్రొడక్ట్ డైరెక్టర్ డాంగ్ వెయ్ డెరెక్ తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో లాంచ్ అయిన రియల్‌మీ క్యూ3లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించారు.


గత నెలలో RMX3461/ RMX3463 మోడల్ నంబర్లతో ఒక రియల్‌మీ ఫోన్ టెనా వెబ్‌సైట్లో కనిపించింది. ఇందులో దీనికి సంబంధించిన ఎన్నో కీలక స్పెసిఫికేషన్లు కనిపించాయి. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4880 ఎంఏహెచ్ కాగా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫఓన్ పక్కభాగంలో ఉంది. ఈ వారం ప్రారంభంలో రియల్‌మీ క్యూ3ఎస్ గీక్ బెంచ్ వెబ్‌సైట్లో కూడా కనిపించింది. సింగిల్ కోర్ టెస్టులో 791 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 2783 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉండనుంది.


Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి