Realme GT 7 Pro: రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అందించారు. 16 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌లో ఉండనుంది. ఇందులో ఏకంగా 6500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు పెరిస్కోప్ టెలిఫొటో షూటర్ ఉండనుంది. నవంబర్ 26వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది.
రియల్‌మీ జీటీ 7 ప్రో ధర (Realme GT 7 Pro Price)
రియల్‌మీ జీటీ 7 ప్రో ధర చైనాలో 3,699 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.43,800) ఉంది. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ (సుమారు రూ.47,400), 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,899 యువాన్లుగానూ (సుమారు రూ.46,200), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 యువాన్లుగానూ (సుమారు రూ.50,900), 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,799 యువాన్లుగానూ (సుమారు రూ.56,900) నిర్ణయించారు.
చైనాలో దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. మార్స్ ఎక్స్‌ప్లొరేషన్ ఎడిషన్, స్టార్ ట్రయల్ టైటానియం, లైట్ డొమైన్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో నవంబర్ 26వ తేదీన రియల్‌మీ జీటీ 7 ప్రో లాంచ్ కానుంది.
రియల్‌మీ జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Realme GT 7 Pro Specifications)
రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల 2కే ఎకో2 స్కై స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 2600 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్‌ని అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ కూడా ఉన్నాయి. 3x, 120x డిజిటల్ జూమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ, లైవ్ ఫొటోలు, ఏఐ బ్యాక్డ్ ఎడిటింగ్ ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 6500 ఎంఏహెచ్ కాగా, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి. సెక్యూరిటీ విషయానికి వస్తే... ఇన్‌డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. 5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, గెలీలియో, బైదు, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?