రియల్‌మీ 9 ప్రో 5జీ సిరీస్ లాంచ్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 16వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో దీన్ని లైవ్‌లో చూడవచ్చు.
రియల్‌మీ 9 ప్రో 5జీ సిరీస్‌లో పవర్‌ఫుల్ 5జీ ప్రాసెసర్లను అందించనున్నారు. ఫోన్ల వెనకవైపు లైట్ షిఫ్ట్ డిజైన్ కూడా అందించారు. ఫ్లాగ్ షిప్ కెమెరాలను కూడా ఇందులో అందించనున్నారు. మిడ్ రేంజ్ ధరలోనే ఈ స్మార్ట్ ఫోన్ల రేట్ ఉండనుందని కంపెనీ ప్రకటించింది.
ఈ స్మార్ట్ ఫోన్ల ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. వీటిలో రియల్‌మీ 9 ప్రో ధర రూ.16,999 గానూ, రియల్‌మీ 9 ప్రో ప్లస్ ధర రూ.20,999 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
రియల్‌మీ 9 ప్రో ప్లస్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ డైమన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలు కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
రియల్‌మీ 9 ప్రోలో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలే ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి.
ఈ రెండిట్లోనూ లైట్ షిఫ్ట్ డిజైన్‌ను అందించారు. సన్‌రైజ్ బ్లూ నుంచి గ్లిట్టెరీ రెడ్ వరకు దీని రంగులు మారనున్నాయి. ఈ డిజైన్ కేవలం సన్‌రైజ్ బ్లూ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది.