Realme Supersonic Charge Technology: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తన కొత్త సూపర్‌సోనిక్ ఛార్జ్ టెక్నాలజీని రేపే ప్రారంభించబోతోంది. ఈ టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఛార్జింగ్‌ టెక్నాలజీ. దీన్ని కంపెనీ రేపు (ఆగస్టు 14వ తేదీ) తీసుకురానుంది. ఇంతకుముందు కంపెనీ 300W ఫాస్ట్ ఛార్జింగ్‌ను తీసుకురాబోతోందని అందరూ భావించారు. అయితే 320W సూపర్‌ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ టెక్నాలజీ రాకతో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం చాలా వేగవంతం కానుంది.


మొదటిగా చైనాలో...
రియల్‌మీ తన 320W సూపర్‌సోనిక్ ఛార్జ్ సొల్యూషన్ టెక్నాలజీని ఆగస్టు 14వ తేదీన చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు తన టీజర్‌లో తెలిపింది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 35 సెకన్లలోనే 0 నుంచి 17 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీతో పాటు నాలుగు కొత్త ఆవిష్కరణలను కూడా పరిచయం చేయబోతున్నట్లు రియల్‌మీ తెలిపింది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


షావోమీకి గట్టిపోటీ
రియల్‌మీ రూపొందించిన ఈ ఫాస్ట్ ఛార్జర్ గత సంవత్సరం తమ కంపెనీనే ప్రవేశపెట్టిన 240W ఫాస్ట్ ఛార్జ్‌కు టెక్నాలజీ పరమైన అప్‌డేట్ నవీకరణ. రియల్‌మీ గత ఏడాది లాంచ్ చేసిన జీటీ 5 మొబైల్‌తో ఈ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 80 సెకన్లలోనే 20 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.


దీంతో పాటు రియల్‌మీ తీసుకువచ్చిన ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ షావోమీ 300W ఛార్జింగ్‌కు డైరెక్ట్ కాంపిటీషన్ ఇస్తుంది. షావోమీ 300W ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 2 నిమిషాల 12 సెకన్లలో 4100 ఎంఏహెచ్ బ్యాటరీని 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.


ఐదు నిమిషాల్లో పూర్తి ఛార్జ్
రియల్‌మీ తీసుకువచ్చిన ఈ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో కొత్త విప్లవాన్ని తీసుకువస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం మూడు నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ టెక్నాలజీ కేవలం ఐదు నిమిషాల్లో బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో ఈ కొత్త టెక్నాలజీని పరిచయం చేయవచ్చు. దీన్ని బట్టి రియల్‌మీ త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్ షిప్ ఫోన్‌లో ఈ టెక్నాలజీని మనం కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉంది.






Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే