Amazon Privacy Policy: బుక్స్ విక్రయాల నుంచి అమెజాన్ సంస్థ ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చింది. జెఫ్ బెజోస్ ఆలోచనలు కార్యరూపం దాల్చడంతో నేడు ఏడాదికి 400 బిలియన్ల ఆదాయంతో విక్రయాలు జరుపుతోంది అమెజాన్. సంస్థ అభివృద్ధిలో అసలు పాత్ర పోషించింది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే మనుషుల తెలివితేటలకు మించిన యూజర్ల డేటా అమెజాన్‌ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. కస్టమర్ డేటాను నిరంతర విశ్లేషణ, ఏ ధరకు ఎలాంటి ఉత్పత్తులు కొంటున్నారు లాంటి విషయాలు అమెజాన్ వ్యాపారాన్ని విస్తరించేందుకు దోహదం చేశాయి.


 అమెజాన్ చేతికి యూజర్ల డేటా 
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లుగా ఉన్న 200 మిలియన్ల మంది వినియోగదారుల డేటాతో పాటు రెగ్యూలర్ అమెజాన్ యూజర్ల షాపింగ్ డేటాతో యూజర్ల మైండ్ సెట్‌ను అమెజాన్ చదివేస్తోందట. షాపింగ్ యాప్, కిండల్ ఈ-రీడర్, రింగ్ డోర్‌బెల్, ఎకో స్మార్ట్ స్పీకర్, ప్రైమ్ స్ట్రీమింగ్ సర్వీస్ వాడకం ద్వారా కొన్ని ఆల్‌గారిథమ్స్, సంస్థ సాఫ్ట్‌వేర్స్ ద్వారా వినియోగదారుడు తరువాత ఏ ప్రొడక్ట్ కొనుగోలు చేస్తారోనని సైతం దాదాపుగా కనిపెట్టేస్తోంది. అమెజాన్‌ వినియోగించే ఈ ఆల్‌గారిథమ్ సేవలను అమెజాన్ ఫోర్‌కాస్ట్ (Amazon Forecast Service) అని పిలుస్తారు. 


తమ డేటాపై అమెజాన్ నిఘా ఉంచడం తెలిస్తే యూజర్లు కచ్చితంగా ఆందోళన చెందుతారు. వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో మాట్లాడిన ఆడియో సైతం మైనింగ్ చేస్తున్నారు. ఈ డేటాను ఆడియో రూపంలో తీసుకుని యూజర్ల మెండ్ సెట్ స్టడీ చేస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సంస్థలు ప్రైవసీ పాలసీ పేరుతో యూజర్ల డేటాను తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈయూ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ఉల్లంఘించినందుకుగానూ గత ఏడాది అమెజాన్ 886.6 మిలియన్ల భారీ జరిమానాకు గురైంది. అమెజాన్ మీ డేటాను తీసుకోకుండా అందుకు మీరు ఏం చేయాలి అనే దానిపై టెక్నికల్‌గా పరిశోధనలు జరుగుతున్నాయి. 


ప్రైవసీ పాలసీ ప్రకారమే డేటా కలెక్షన్.. (Privacy Policy Of Amazon)
ఈయూ, యూకేలతో పోల్చితే డేటా ప్రొటెక్షన్ రెగ్యూలేషన్ అమెరికాలో అధికం. యూరప్‌లో డేటాను అధికంగా సేకరించేందుకు అవకాశం ఉంది. ప్రైవసీ పాలసీ ప్రకారం టెక్ దిగ్గజం అమెజాన్ భారీ మొత్తంలో యూజర్ల డేటాను సేకరిస్తుంది. అమెజాన్‌కు కస్టమర్ ఇచ్చే సమాచారం, ఆటోమేటిక్‌గా అమెజాన్ సేకరించే డేటా, ఇతర డెలివరీ క్యారియర్స్ ద్వారా ఇలా మూడు విధాలుగా కస్టమర్ డేటా సేకరిస్తుంది అమెజాన్. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో మాట్లాడితే మీ పేరు, అడ్రస్, మీరు చెప్పిన విషయాలను సేవ్ చేసుకుంటుంది. ఇక మీ ఆర్డర్, మీరు ఏం చూస్తున్నారో చెప్పడానికి ప్రైమ్‌లో మీరు వీక్షించే కంటెంట్ సరిపోతుంది. మీరు వెబ్ ద్వారా అమెజాన్ వినియోగిస్తే దాని కుకీస్ ద్వారా ఇతర ఏ వెబ్‌సైట్స్ చూశారు, అమెజాన్‌లో ఏ ప్రొడక్ట్ తీసుకున్నారో రికార్డ్ అవుతుంది. మెరుగైన సర్వీసులు అందించేందుకు డేటా సేకరణ తప్పనిసరి కొందరు నిపుణులు చెబుతున్నారు.


మీ ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ కోసం వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకుంటుంది. కస్టమర్ కేవలం యాప్, వెబ్‌సైట్ ద్వారా అమెజాన్ ను వినియోగిస్తే మీరు ఏ సమయంలో, ఎప్పుడు కొనుగోలు చేస్తున్నారు, పేమెంట్ చేసేది ఎప్పుడు లాంటి వివరాలు రికార్డ్ అవుతాయి. కొందరు ఆఫీసు అడ్రస్ ఇస్తారు కనుక మీరు ఏ పని చేస్తారనేది సైతం ప్రైవసీ పాలసీలో భాగంగా సేవ్ అవుతుందిని డేటా ప్రొటెక్షన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ రొవెన్న ఫిల్డింగ్ వెల్లడించారు. 


ఫేషియల్ రికగ్నిషన్ డేటాను థర్డ్ పార్టీలతో షేర్ చేసేది లేదని అమెజాన్ చెబుతోంది. కానీ జియోలొకేషన్ ట్యాగ్‌లు, డివైస్‌ సంబంధిత డేటా, కొనుగోలు చేసే వస్తువుల డేటా మాత్రం షేర్ అవుతుంది. అమెజాన్ ఫోటోలు కస్టమర్ డేటాను థర్డ్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించదు. ఎలాంటి ప్రకటనల కోసం వినియోగించదని ఓ ప్రతినిథి తెలిపారు.


సొంత నెట్‌వర్క్‌లకు అమెజాన్ డేటా షేరింగ్..
కస్టమర్ ఉపయోగించే సర్వీసులను బట్టి అమెజాన్ చేతికి అంత డేటా వెళ్లే అవకాశం ఉంది. అమెజాన్ సూచించినప్పుడల్లా యూజర్ తన అనుభవాన్ని తెలపడంతో సంస్థకు ఇది ఈ ప్లస్ పాయింట్ అవుతుందని, మీరు ఎలా ఆలోచిస్తారో సైతం తెలుసుకుంటుందని బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీ డిజిటల్ ఫోరెన్సిక్స్‌ సీనియర్ లెక్చరర్ రిచర్డ్ హేల్ తెలిపారు. అయితే సొంత కంపెనీలలో దేనికి ఎంత మేర సమాచారం షేర్ అయింతో కచ్చితంగా చెప్పలేమని సమాచార, ప్రైవసీ పాలసీ నిపుణుడు విల్ రిచ్‌మండ్ కొగ్గన్ అన్నారు. సంస్థకు చెందిన ఇతర విభాగానికి డేటా షేర్ అయిందని కస్టమర్లు భావించాలని సూచించారు.


థర్డ్ పార్టీలకు డేటా షేర్ అవుతందా.. 


గూగుల్, ఫేస్‌బుక్ కంపెనీల తరహాలో నెట్‌వర్క్ కలిగి ఉండటం అమెజాన్‌కు ప్లస్ పాయింట్. తద్వారా కస్టమర్ డేటా దాని అనుబంధ సంస్థలకు షేర్ అవుతుంది. దీనివల్ల కస్టమర్లకు ఏ ఇబ్బంది లేదు. యూజర్లకు సంబంధించి వారు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు, గతంలో ఏం కొనుగోలు చేశారనేది తెలుసుకునే వీలుంటుందని కంపెరీటెక్ ప్రైవసీ అడ్వకేట్ పాల్ చిస్ఛాఫ్ తెలిపారు. తన వెబ్‌సైట్‌కు వచ్చే యూజర్లను ట్రాక్ చేసేందుకు ఇతర సంస్థలను అమెజాన్ అనుమతిస్తుందని, డేటా సేకరణకు ఇది కలిసొస్తుందని మరో నిపుణుడు వోల్ఫీ క్రిస్టల్ అన్నారు. గూగుల్, ఫేస్ బుక్ లాంటి కంపెనీలు ట్యాగ్స్ ద్వారా యూజర్లను గుర్తిస్తుందని చెప్పారు.


అమెజాన్ ఏమంటోంది..
కస్టమర్ డేటాను థర్డ్ పార్టీస్‌కు షేర్ చేయడం, విక్రయించడం గానీ చేయడం లేదని అమెజాన్ చెబుతోంది. కేవలం యూజర్లకు కావాల్సిన వస్తువులు, సర్వీసుల వివరాలతో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలు చిక్కుతుందని వివరణ ఇచ్చింది. 


అమెజాన్ డేటా సేకరణను ఎలా ఆపాలంటే..
అమెజాన్ సంస్థ డేటా కలెక్షన్ చాలా పెద్ద నెట్‌వర్క్. మీరు దాని నుంచి బయటపడాలంటే అమెజాన్ సర్వీసులను వాడకపోవడమే ముఖ్యమైన మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పటికే కంపెనీ మీ డేటాను కలెక్ట్ చేసిందని మీకు ఆనుమానం ఉన్నట్లయితే.. ‘డేటా సబ్జెక్ట్ యాక్సెస్ రిక్వెస్ట్’ కింద దరఖాస్తు చేసి కంపెనీతో ఉన్న మీ డేటా కాపీని కస్టమర్లు పొందవచ్చు. అలెక్సా అసిస్టెంట్, రింగ్ డోర్‌బెల్ రికార్డింగ్‌లను రిమూవ్ చేయడానికి, ప్రైవసీ పాలసీ సెట్టింగ్స్ మార్చుకోవడానికి కొన్ని సెంటర్స్ కూడా ఉన్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు చూడవచ్చు, ఎవరు యాక్సెస్ చేయవచ్చో కూడా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేయవచ్చు. ‘అలెక్సా, నేను ఇప్పుడే చెప్పిన విషయాన్ని డిలీట్ చెయ్’ అని చెబితే అలెక్సా ఆ సూచనను పాటిస్తుంది. 


తమ బ్రౌజింగ్, ప్రొడక్ట్స్ కొనుగోలుకు సంబంధిత సమాచారాన్ని కస్టమర్లు అమెజాన్ అకౌంట్ నుంచి ఎప్పటికప్పుడూ చూసుకోవచ్చునని అమెజాన్ చెబుతోంది. డక్ డక్ గో, బ్రేవ్ టు స్టాప్ అమెజాన్ లాంటి ప్రైవసీ అందించే బ్రౌజర్లు వాడితే సరిపోతుంది. ఎందుకంటే అమెజాన్ వాడుతూ మీ డేటాను కాపాడుకోవడం అంత తేలికైన విషయం కాదు. బ్రౌజింగ్ హిస్టరీ, ప్రైవసీ సెట్టింగ్స్‌ను ప్రతిసారి మార్చుకోవడం కుదరదని క్రిస్ బోయ్డ్ అన్నారు. అమెజాన్ యాప్‌లో బ్రౌజింగ్ హిస్టరీ ఆఫ్ చేసుకోవాలని సూచించారు. అయినప్పటికీ మీకు అమెజాన్ యాడ్స్, థర్డ్ పార్టీ అడ్వైర్టైజ్‌మెంట్స్ కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేయకుండా ఉంటే సరిపోతుందని డేటా నిపుణులు సూచిస్తున్నారు.