Poco M6 Pro 5G 8GB + 256GB: పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌లో కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై పోకో ఎం6 ప్రో 5జీ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 6.79 అంగుళాల భారీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో అందించారు. పోకో ఫోన్లలో ఇదే అత్యంత భారీ డిస్‌ప్లే అని కంపెనీ ప్రకటించింది.
పోకో ఎం6 ప్రో 5జీ ధర (Poco M6 Pro 5G Price in India)
ఈ స్మార్ట్ ఫోన్ గతంలో రెండు స్టోరేజ్ వేరియంట్లలో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా నిర్ణయించారు. ఇప్పుడు లాంచ్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎం6 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco M6 Pro 5G Specifications, Features)
పోకో ఎం6 ప్రో 5జీలో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ప్రొటెక్షన్ అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై పోకో ఎం6 ప్రో 5జీ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఫోన్ రన్ కానుంది. రెండు మేజర్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా అందించనున్నారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 6 జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే 14 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌లో ఉండనుందన్న మాట.
పోకో ఎం6 ప్రో 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఐపీ53 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!