Poco F6 5G India Launch: పోకో ఎఫ్6 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. దీని డిజైన్‌ను కూడా టీజ్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై పోకో ఎఫ్6 5జీ రన్ కానుంది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు గతంలోనే లీకయ్యాయి. చైనాలో గత నెలలో లాంచ్ అయిన రెడ్‌మీ టర్బో 3కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. లాంచ్ అయ్యాక స్పెసిఫికేషన్లు బయటకు వస్తే అసలు గుట్టు బయటపడిపోతుంది. రెండు ఫోన్ల స్పెసిఫికేషన్లు, డిజైన్ ఒకేలా ఉంటే జస్ట్ పేరు మార్చి మనదేశంలో డంప్ చేస్తుందని అనుకోవచ్చు.


పోకో ఎఫ్1 లెవల్ సక్సెస్ అవుతుందా?
2018లో మనదేశంలో లాంచ్ అయిన పోకో ఎఫ్1 చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎంత పెద్ద సక్సెస్ అంటే పోకోని సపరేట్ బ్రాండ్ చేసేంత. కానీ తర్వాత వచ్చిన పోకో ఫోన్లు ఆ సక్సెస్‌ను రిపీట్ చేయలేకపోయాయి. కానీ ఇప్పడు పోకో ఎఫ్6 5జీ స్పెసిఫికేషన్లు చూస్తే దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ పోకో ఎఫ్1 మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉందని అనుకోవచ్చు.


‘గాడ్ మోడ్ ఆన్’...
మే 23వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు పోకో ఎఫ్6 5జీ మనదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ దీనికి సంబంధించిన టీజర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. దీనికి ‘గాడ్ మోడ్ ఆన్’ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది. ఫోన్ వెనకవైపు ప్యానెల్‌ను ఈ టీజర్‌లో చూడవచ్చు. ఇందులో కెమెరా యూనిట్లను రివీల్ చేశారు.


పోకో ఎఫ్6 5జీలో వెనకవైపు రెండు కెమెరాలు చూడవచ్చు. దీంతో పాటు రింగ్ తరహాలో ఉన్న ఫ్లాష్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. కాబట్టి ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానున్నాయని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.


Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!


రెడ్‌మీ టర్బో 3 తరహాలో...
పోకో ఎఫ్6 5జీ వెనకవైపు కెమెరా సిస్టం అరేంజ్‌మెంట్‌ను చూస్తే రెడ్‌మీ టర్బో 3ని పోలి ఉంది. టీజర్‌లో చూపించిన కలర్ కూడా రెడ్‌మీ టర్బో 3 ఐస్ టైటానియం కలర్ ఆప్షన్ తరహాలో ఉంది. రెడ్‌మీ టర్బో 3 చైనాలో నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,000) నిర్ణయించారు. ఇది మాత్రమే కాకుండా 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు కూడా ఉన్నాయి.


పోకో ఎఫ్6 5జీ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల 120 హెర్ట్జ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో చూడవచ్చు. ఫోన్ ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎఫ్6 5జీ రన్ కానుంది.


Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!