Andhra Pradesh News: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు.

Palnadu News: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు సజీవ దహనం




Bus Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Bus)ను టిప్పర్‌ లారీ(Lorry) ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు.ఒకే కుటుంబానికి ముగ్గురు మంటల్లో కాలి బూడిదయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్(Hyderabad) తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.


సజీవ దహనం
తెల్లవారుతుండగానే ఆరుగురి బతుకులు తెల్లారిపోయాయి. పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. చిన్నగంజాం నుంచి చీరాల(Chirala) మీదుగా హైదరాబాద్(Hyderabad) వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో డ్రైవర్ సహా బస్సులోని నలుగురు ప్రయాణికులు కాలిబూడిదయ్యారు. టిప్పర్ డ్రైవర్‌ కూడా సజీవ దహనమయ్యారు.మిగిలిన ప్రయాణికులు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.


గాఢ నిద్రలోనే శాశ్వత నిద్ర
సార్వత్రిక ఎన్నికల కోసం హైదరాబాద్‌ నుంచి చీరాల సమీపంలోని వివిధ గ్రామాలకు పెద్దఎత్తున ప్రజలు ఓట్లు వేసేందుకు బయలుదేరి వెళ్లారు. ఓట్లు వేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి మళ్లీ హైదరాబాద్‌(Hyderabad)కు తిరుగు ప్రయాణమయ్యారు. బాపట్ల(Bapatla) జిల్లా చిన్నగంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బుక్‌చేసుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు ఎక్కించుకుని బస్సు చీరాల మీదుగా హైదరాబాద్ వస్తుండగా...మార్గమధ్యలో పల్నాడు(Palnadu) జిల్లా  పసుమర్రు సమీపంలోని ఉరిపాలెం(Uripalem) వద్ద ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌లారీ బలంగా ఢీకొట్టింది. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో తొలుత టిప్పర్‌లారీలో మంటలు చెలరేగి అవి బస్సుకు వ్యాపించాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో చిక్కుకున్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రయాణికులంతా చిన్నగంజాం, గోనసపూడి, నీలాయపాలెం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.


బస్సు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతోపాటు బస్సు డ్రైవర్‌, టిప్పర్‌ డ్రైవర్ మంటల్లో సజీవదహనమయ్యారు. వీరిలో నీలాయపాలెంకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కాళీ బ్రహ్మేశ్వరరావు(62), భార్య లక్ష్మీ( 58), మనవరాలు పిట్టు( 09) చనిపోయారు. డ్రైవర్ అంజి( 35). స్వల్పగాయాలతో బయటపడిన వారిని చిలకలూరిపేట(Chilakaluripeta), గుంటూరు(Guntur) ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిని పర్చూరు తెలుగుదేశం ఎమ్మెల్యే  ఏలూరి సాంబశివరావు(Eluri Sambasivarao) పరామర్శించారు.


 అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల-వాడరేవు బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ లారీ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది.


మృతుల వివరాలు:-
1. అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా.
2. ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
3. ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
4. ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.