Poco F6 5G Flipkart Sale: పోకో ఎఫ్6 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ బ్లాక్‌బస్టర్ ఎఫ్-సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది అందుబాటులో ఉండనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ దక్కించుకోవచ్చు. క్వాల్‌కాం లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇది ఒక 4 ఎన్ఎం ఆక్టాకోర్ చిప్‌సెట్. పోకో ఎఫ్6 5జీలో ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. 1.5కే రిజల్యూషన్ ఉన్న స్క్రీన్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయర్ కెమెరా సెటప్‌ను అందించారు. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని స్పెసిఫికేషన్లు చూస్తే గతంలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ టర్బో 3 తరహాలో ఉంది.


పోకో ఎఫ్6 5జీ ధర (Poco F6 5G Price in India)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.29,999గా నిర్ణయించారు. అయితే బ్యాంక్ ఆఫర్లు ఉపయోగిస్తే దీన్ని రూ.25,999కే కొనుగోలు చేయవచ్చు. రూ.31,999 ధర ఉన్న 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.27,999కి, రూ.33,999 ధరతో లాంచ్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.29,999కు కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, టైటానియం కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


పోకో ఎఫ్6 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco F6 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ ఫోన్‌కు మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 6.67 అంగుళాల 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ కూడా అందించారు. హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్, వైడ్‌వైన్ ఎల్1 వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ అందుబాటులో ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లను ఇందులో చూడవచ్చు. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ ఓవీ20బీ కెమెరాను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై పోకో ఎఫ్6 5జీ రన్ కానుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి.


5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, ఏ-జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బైదు, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ద్వారా దీన్ని అన్‌లాక్ చేయవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. బాక్స్‌తో పాటు 120W అడాప్టర్‌ను అందించనున్నారు. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.


Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో