Trinayani Today Episode గురువుగారు తీసుకొచ్చిన బిడ్డ విశాలాక్షి గారడి వల్ల పాముగా మారుతుంది. దీంతో సుమన ఆ పాప ఉలూచి అనే నమ్మేస్తుంది. ఏడుస్తూ పాలు తాగిస్తా అని పాముని తన వెంట తీసుకెళ్తుంది. విశాల్ ఇదంతా నీ గారడే కదా అని విశాలాక్షిని అడిగి థ్యాంక్స్ చెప్తాడు.


హాసిని: నీ మ్యాజిక్ వల్ల మేం బతికిపోయాం.


విశాలాక్షి: ఇప్పుడే ఇలా అంటే తిలోత్తమ అమ్మ వచ్చాక ఏం అంటారో. 


హాసిని: గురువుగారు ఆ పిల్ల అలా మారింది ఏంటి. ఉలూచి అయితే పాములా మారుతుంది. ఆ పిల్ల ఉలూచి కాదు కదా ఎలా మారింది.


గురువుగారు: విశాలాక్షి చేసిని గారడి వల్ల పసిబిడ్డ పాముగా మారింది. 


విశాల్: తెల్లారితే మళ్లీ మామూలుగా అయిపోతుంది కదా స్వామి.


గురువుగారు: అంత వరకు ఉండదు మూడు గడియల్లో మళ్లీ ఆడపిల్లలా మారిపోతుంది. 


హాసిని: అలా జరిగితే చిట్టీ గుర్తు పట్టేస్తుందిగా.


విశాల్: గుర్తు పట్టడం కాదు వదినా తన కూతురు కాదని పసిగట్టేస్తుంది. ఇంతలో నయని రావడంతో నమస్తే చెల్లి అని హాసిని కవర్ చేస్తుంది. 


విశాల్: ఇలా వచ్చావ్ ఏంటి నయని.


నయని: స్వామి గారు తీసుకొచ్చిన బిడ్డని తన బిడ్డ కాదు అన్న సుమన పాప పాము పిల్లగా మారగానే అక్కున చేర్చుకుంది ఆ సంతోషం మీతో పంచుకోవాలి అని ఇలా వచ్చాను. 


హాసిని: నువ్వు పంచుకుంటావ్. చిట్టీ పెంచుకుంటుంది.


నయని: ఏంటి.


హాసిని: పిల్లని.


నయని: అదేంటి ఉలూచి తన కన్న కూతురే కదా. గాయత్రీని నేను పెంచుకున్నాను అంటే అర్థం ఉంది. 


గురువుగారు: నీకు నేను వివరంగా చెప్తాను నయని. సర్పదీవి నుంచి వచ్చాక ఉలూచి మారిపోయింది. ఇప్పుడు తన బిడ్డే అన్నా రేపు ఎప్పుడైనా ఇంతకు ముందులా ఉండే ఉలూచిలా లేదు అని సరిగా పెంచుతుందో లేదో అని హాసిని అనుమానం. 


నయని: అక్క అనుమాన పడినట్లు లేదు స్వామి. ఆ బిడ్డను ఎక్కడ నుంచో తెచ్చినట్లు మాట్లాడుతుంది. సర్పదీవికి వెళ్లిన వాళ్లు తిరిగి రారు అని గాయత్రీ, ఉలూచి అలా ఎలా వచ్చారు అని ముక్కన వేలేస్తున్నారు. అత్తయ్య కూడా వచ్చేస్తే వల్లభ బావ టెన్షన్ పోతుంది.


అఖండ: మీ అమ్మ ఆచూకి తెలియక ముందు అసలు మీ అమ్మ సర్ప దీవికి ఎందుకు వెళ్లిందో తెలుసుకోవాలి వల్లభ.


వల్లభ: మీకు తెలీనట్లు అడుగుతున్నారు.


అఖండ: నీకు తెలీదా.


వల్లభ: అదేంటి స్వామి అక్కడికి వెళ్తే మృత్యు గండం పోతుంది అని చెప్పారు కదా.


అఖండ: అక్కడికి వెళ్తేనే ప్రాణాలు పోతాయి అని చెప్పలేదా. ఎవరి మాటలు విని మీ అమ్మని పంపారు. తన వెంట గాయత్రీ పాప వెళ్లింది అన్నారు. అంతకు మించి మృత్యువు ఎక్కడ ఉంటుంది. మీ అమ్మ తన చావుని పక్కన పెట్టుకొని వెళ్లిందిరా.


వల్లభ: అయ్యో స్వామి ఆ గాయత్రీని పక్కన పెట్టుకొని  వెళ్తేనే నువ్వు క్షేమంగా తిరిగి రాగలవని ఆ గారడీ పిల్ల విశాలాక్షి చెప్పింది.


అఖండ: అయితే ఇదంతా నాటకం అయిండొచ్చు. అమ్మవారి లీల తిలోత్తమను సర్పదీవికి ఎందుకు తీసుకెళ్లిందో.. గాయత్రీని వెంట తీసుకొని ఎందుకు వెళ్లమందో ఇవన్నీ వివరాలు తెలియాలి. 


వల్లభ: అంతా అయోమయంగా ఉంది స్వామి. ఇప్పుడు నాకు మా మమ్మీ కావాలి ఎక్కడుందో చెప్పండి.


అఖండ: వెళ్లిన గాయత్రీ, ఉలూచి తిరిగి వచ్చారు అన్నావంటే మీ అమ్మకూడా వచ్చి తీరాలి. 


వల్లభ: మరి మమ్మీ ఇంటికి రాలేదు.


అఖండ: ఇప్పుడు ఇంటికి రావాల్సింది మీ అమ్మకాదు. గంటలమ్మ. ఆమెను కలువు మిగతా పనులు సులువు అవుతాయి. అని అడ్రస్ చెప్తారు. 


విశాల్, హాసిని మాట్లాడుకుంటారు. విశాలాక్షి చెప్తేనే పిల్లలను తిలోత్తమను సర్పదీవికి పంపామని కానీ ఒక్కరే తిరిగి వచ్చారని హాసిని అంటుంది. దీంతో విశాల్ ఇద్దరు వచ్చారని చెప్పమని అంటాడు. దాంతో హాసిని మనకు తెలుసు కదా ఒక్కరే అని అంటుంది. హాసినికి పొరపాటున కూడా నోరు జారొద్దని అంటాడు విశాల్. ఇంతలో నయని వస్తుంది. ఇక నయని వస్తే తిలోత్తమ దారి తప్పిందని విశాలాక్షి నీకు ఏమైనా చెప్పిందా అని అడుగుతారు. విశాలాక్షి చెప్పలేదు అని కానీ వచ్చేటప్పుడు తాంత్రిక శక్తులను కూడా దాటుకొని రావాలని అందుకే తిలోత్తమ దారి తప్పిందని నయని అంటుంది. అయితే పెద్దావిడ రాలేకపోయింది పిల్లలు ఎలా వచ్చారు అని అందరూ అడుగుతున్నారని అంటుంది. దాంతో విశాల్ పిల్లుల దేవుడితో సమానం ఏమైనా సాధ్యమవుతుందని అంటాడు.  


వల్లభ గంటలమ్మ దగ్గరకు వెళ్తాడు. ఆమెను చూసి వల్లభ గజగజా వణికిపోతాడు. దాంతో గంటలమ్మ వల్లభకు ధైర్యంగా ఉండమని తనకు ఏం కావాలో చెప్పమని అంటుంది. వల్లభ తనకు తన తల్లి కావాలని అంటాడు. తన తల్లి సర్పదీవికి వెళ్లి తప్పిపోయిందని చెప్తాడు. గంటలమ్మ షాక్ అవుతుంది. అక్కడికి వెళ్లిన వారు తిరిగి రారు అని చెప్తుంది. దీంతో వల్లభ పిల్లలు తిరిగి వచ్చారని అందులో ఒకరు పాము పిల్ల అని చెప్తాడు. 


గంటలమ్మ: అర్థమైంది ఇందులోనే కిటుకు ఉందిరా. మీ ఇంట్లో ఆత్మ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. నన్ను మీ ఇంటికి తీసుకెళ్లు ఆ ఆత్మనో ఆ గాయత్రీ దేవినో పట్టిస్తా అప్పుడు మీ అమ్మ వస్తుందో రాదో తేల్చేస్తా..


వల్లభ: అలాగే..


హాల్‌లో నయని పని చేస్తూ ఉంటే హాసిని వచ్చి మేం చేస్తాం మాకు చెప్పు అని అంటుంది. ఇంతలో సుమన వచ్చి పని మనిషి అనుకుంటారు అంటుంది. దురంధర నయని అందంగా ఉందని అంటూ సుమనకు చురకలు వేస్తారు. ఇక అందరూ తిలోత్తమ వస్తుందని అనుకుంటారు. మరోవైపు గాయత్రీ పాప విశాల్ దగ్గరకు వెళ్తుంది. విశాల్ పాపని ఆడుకోమని కాసేపు అయ్యాక తనతో ఆడుకుంటా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ టైమింగ్ మార్పు, రిషీ రీ-ఎంట్రీ కూడా ఫిక్స్? రోజూ ఎన్ని గంటలకు ప్రసారమంటే?