Guppedanta Manasu Serial Today Episode: ఎంజేల్ మనుకు కన్ను కొడుతుంది. దీంతో మను ఇక్కణ్నుంచి వెళ్లిపో అంటాడు. తాను వెళ్లనని నువ్వు నా అత్తకొడుకువి అని చెప్తుంది. నీ మూడు చేంజ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. దీంతో నేను అందరిలాంటి వాణ్ని కాదని నీ ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థం అయిందని నా జీవితంలో ఎవ్వరికీ చోటు లేదని చెప్తాడు. ఇది అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తాడు మను. వెళ్లకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది ఎంజేల్. అయితే నేనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని మను అనగానే ఎంజేల్ సరేలే నేనే వెళ్లిపోతాను అంటూ అక్కడి నుంచి బయటకు వస్తుంది. బయట ఎంజేల్, మనులను గమనిస్తున్న వసుధార ఎంజేల్‌ను మనుపై నీ అభిప్రాయం ఏంటని అడుగుతుంది. దీంతో చాలా మంచి వాడని కానీ ఎప్పుడూ మూడీగా ఉంటాడని ఎంజేల్ చెప్తుంది. తర్వాత మహేంద్ర, వసుధార, మను వాళ్ల బామ్మ దగ్గరకు వెళ్తారు.
బామ్మ: చెప్పండి మహేంద్ర గారు ఏదో అర్జెంట్‌గా మాట్లాడాలి అని చెప్పారు. ఏ విషయం గురించి
మహేంద్ర: మను గురించి..
బామ్మ: మను గురించా? ఏం మాట్లాడాలి?
మహేంద్ర: నేను తండ్రి స్థానంలో ఉండి మనుకు ఒక మాటిచ్చాను.
అని మహేంద్ర చెప్పగానే నువ్వు తండ్రి స్థానంలో ఉండటం ఏంటి? నువ్వేగా వాడి తండ్రివి అని మనసులో అనుకుంటుంది. మను కన్నతండ్రిని తీసుకొస్తానని మనుకు నేను మాటిచ్చాను అని చెప్తాడు. దీంతో బామ్మ షాక్ అవుతుంది. నా దగ్గరున్న ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలని మహేంద్ర అడుగుతాడు. మీకు మను తండ్రి ఎవరో తెలిస్తే చెప్పండి అని సూటిగా అడుగుతాడు మహేంద్ర.
మహేంద్ర: అనుపమకు పెళ్లి కాలేదు కదా
బామ్మ: అవును కాలేదు..
మహేంద్ర: మరి అనుపమను మోసం చేసింది ఎవరు నాకు చెప్పండి వాడు ఎక్కడ ఉన్నా కాలర్ పట్టుకుని తీసుకొస్తాను.
బామ్మ: కన్నతల్లే తండ్రి గురించి చెప్పనప్పుడు నేనెందుకు చెప్పాలి.
మహేంద్ర: ప్లీజ్ మను బాధ మీరు చూడటం లేదా? మను తండ్రి ఎవరో నాకైనా చెప్పండి
బామ్మ: నేను చెప్పను చెప్పలేను..
అనగానే అక్కడికి అనుపమ వస్తుంది. నీకేం చెప్పాలని నిలదీస్తుంది. ఏకంగా ఇప్పుడు మా పెద్దమ్మ దగ్గరకు వచ్చావు నీకు ఎలా చెప్పాలి అంటూ కోప్పడుతుంది. దీంతో వాడ్ని పాతికేళ్లు పెంచిన తల్లే చెప్పడం లేదు అని బామ్మ అనగానే దీంతో మహేంద్ర పెంచిన తల్లా? అని డౌట్ పడతాడు. దీంతో అనుపమ మహేంద్ర మీద కోప్పడుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే గొడవ పెద్దది అయ్యేలా ఉంది అని మనసులో అనుకుని మహేంద్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార.
మహేంద్ర: మను మనకు ఎంత సాయం చేశాడు. నువ్వు తనని అపార్థం చేసుకున్నా తను మాత్రం నీకు గౌరవం ఇస్తూనే వచ్చాడు.
వసు: నేను కాదనడం లేదు మామయ్య. మను వ్యక్తిత్వం గురించో మంచితనం గురించో చెప్పడం లేదు. తన పర్సనల్ విషయంలోకి వెళ్లొద్దు అంటున్నాను.
మహేంద్ర: మన అవసరాల కోసం తనని ఉపయోగించుకుని.. తర్వాత వదిలేద్దాం అంటున్నావా?
అంటూ మహేంద్ర అనగానే మీతో నెనెప్పుడూ ఇలా ఆర్గ్యూ చేశానా అర్థం చేసుకోండి అని వసు అనగానే మను తండ్రి ఎవరో నీకు తెలుసు కదా? అంటే అనుపమ నీకు చెప్పింది కానీ తన కొడుకుకు చెప్పలేదంటే అంటూ అడుగుతాడు. దీంతో వసు మహేంద్రను మీరు మళ్లీ కాలేజీకి రండి అని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'టిల్లు 3’లో రాధిక ఉంటుందా? - నేహా శెట్టి సమాధానం ఇదే!