గూగుల్ సంస్థ తన వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ కు రెడీ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే Google I/O 2023 లాంచ్ ఈవెంట్ ఇవాళ రాత్రి 10.30 నిమిషాల నుంచి భారత్ లో ప్రత్యక్షప్రసారం కానుంది. I/O అనేది టెక్ దిగ్గజం గూగుల్ కు సంబంధించిన తాజా విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న డెవలపర్‌ల కోసం నిర్వహించే అతిపెద్ద వార్షిక ఈవెంట్ ఇది. ఆండ్రాయిడ్, , పిక్సెల్ పరికరాల్లో ఉపయోగించే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్‌లకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను తెలిపేందుకు Google ప్రతి ఏటా ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో గూగుల్ పలు ఆవిష్కరణలు చేయనుంది. కంపెనీకి సంబంధించిన పలు వాచ్ లు, టాబ్లెట్స్, ఫోన్లు ఆవిష్కరణ కానున్నాయి. చాలా మంది ఇదే ఈవెంట్ లో పిక్సెల్ వాచ్ 2 లాంచ్ అవుతుందని అందరూ భావించారు. కానీ, తాజా నివేదికలు మాత్రం అందులో వాస్తవం లేదంటున్నాయి.
అక్టోబర్ లో పిక్సెల్ వాచ్ 2 ఆవిష్కరణ
Google I/O 2023 లాంచ్ ఈవెంట్ లో పిక్సెల్ 7a, పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ టాబ్లెట్ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Google Pixel 7a భారత్ లో ఒక రోజు తర్వాత, మే 11న అందుబాటులోకి వస్తుందని టెక్ దిగ్గజం ఇప్పటికే ధృవీకరించింది. Google Pixel 8, Pixel 8 Proతో పాటు Google Pixel వాచ్ నెక్ట్స్ ఎడిషన్ ఈ సంవత్సరం చివర్లో ఆవిష్కరించబడుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 9to5Google నివేదిక ప్రకారం, పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోతో పాటు లాంచ్ చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అటు అక్టోబర్‌లో దాని ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను విడుదల చేయనుంది. ఆపిల్ కూడా, ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ లైనప్‌ను ఆవిష్కరిస్తుంది.
పిక్సెల్ వాచ్ తన తొలి ఎడిషన్ 2022లో Google I/O డెవలపర్ కాన్ఫరెన్స్ లో ఆవిష్కరించబడింది. పిక్సెల్ వాచ్ 1.2-అంగుళాల AMOLED డిస్‌ప్లేను 1,000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, ఆల్వేస్ ఆన్ మోడ్‌తో కలిగి ఉంది. పిక్సెల్ వాచ్ Exynos 9110 SoC ద్వారా శక్తిని పొందింది. ఇది కార్టెక్స్ M33 కో-ప్రాసెసర్, 2GB RAMతో జత చేయబడింది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ v5.0, 4G LTE వైర్‌లెస్ కనెక్టివిటీ, 2.4GHz Wi-Fi ఎంపికలు ఉన్నాయి.
Google Pixel 7a ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఇవాళ జరిగే Google I/O వార్షిక సమావేశంలో గూగుల్ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు. మే 11న Google Pixel 7a భారత్ లో ఆవిష్కరించబడుతుంది. ఈ హ్యాండ్ సెట్ కార్బన్, ఆర్కిటిక్ బ్లూ, కాటన్ అనే మూడు రంగులలో అందుబాటులోకి రానుంది. Quandt తాజాగా Pixel 7a ఫోటలను పోస్ట్ చేసింది. Pixel 7aలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. Pixel 7a వెనుక భాగంలో 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో పాటు 64MP ప్రైమరీ వైడ్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ముందువైపు 13MP సెల్ఫీ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. Pixel 6a కాకుండా, Pixel 7a ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ కు సపోర్టు ఇవ్వనుంది.
Read Also: వాట్సాప్‌ను నమ్మలేం, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు