Fake Court Order Email Scam: డిజిటల్ ప్రపంచంలో స్కామర్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దుండగులు నకిలీ కోర్టు ఆర్డర్ ఇమెయిల్ పంపడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. మీ ఇంటర్నెట్ వినియోగానికి వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్ జారీ చేయబడిందని మీకు ఏదైనా ఇమెయిల్ వచ్చిందా? అయితే ఆ మెయిల్ మీ ఒక్కరికే రాలేదని తెలుసుకోండి. ప్రభుత్వం దీనిని సైబర్ మోసంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
హెచ్చరించిన ప్రభుత్వం
ప్రభుత్వ అధికారిక పీఐబీ ఫాక్ట్ చెక్ హ్యాండిల్ ద్వారా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో హెచ్చరికను జారీ చేసింది. ఈ ఇమెయిల్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిందని పేర్కొంటారు. వినియోగదారులు అనుచిత కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారని అందులో ఆరోపిస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరిస్తుంది. అయితే ఇది పూర్తిగా బూటకమని తెలుసుకోండి.
ఈమెయిల్‌లో ఏం క్లెయిమ్ చేస్తారు?
మీ ఇంటర్నెట్ కార్యకలాపాలు ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించిందని, మీకు వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్ జారీ చేయబడిందని ఈ నకిలీ ఇమెయిల్లో పేర్కొంటారు. మీరు అశ్లీల చిత్రాలను చూడటానికి ఇంటర్నెట్‌ను ఉపయోగించారని ఆరోపిస్తార. ఇంటెలిజెన్స్ బ్యూరో, సైబర్ క్రైమ్ పోలీస్ యూనిట్‌తో కలిసి, అత్యాధునిక ఫోరెన్సిక్ సాధనాల ద్వారా ఇటువంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని కూడా పేర్కొంది. ఇమెయిల్ చివరలో "ప్రాసిక్యూటర్" అని పిలుచుకునే వ్యక్తి ప్రశాంత్ గౌతమ్ సైన్ ఆఫ్ చేస్తాడు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
ఇమెయిల్‌ను డిలీట్ చేసేయండి
ఈ ఇమెయిల్ పూర్తిగా నకిలీదని, ప్రజలను భయపెట్టడానికి లేదా ట్రాప్ చేయడానికి మాత్రమే సృష్టించబడిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటువంటి అనధికార ఇమెయిల్‌ల ద్వారా లీగల్ నోటీసులు ఎప్పుడూ పంపరు. వారు ఎల్లప్పుడూ అధికారికంగానే సంప్రదిస్తారు. మీరు ఆన్‌లైన్ భద్రత గురించి ఆందోళన చెందుతుంటే భారతదేశంలోని అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం సరైన మార్గం.
మీకు ఇలాంటి ఈమెయిల్ వస్తే ఏమి చేయాలి?
భయపడవద్దు: ఇది మిమ్మల్ని భయపెట్టడానికి, మోసగించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. కాబట్టి భయపడకుండా ఉంటే సరిపోతుంది.
లింక్‌పై క్లిక్ చేసి సమాచారాన్ని షేర్ చేయవద్దు: ఇటువంటి స్కామ్‌లను మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి లేదా మీ పరికరంలో మాల్‌వేర్‌ను ఉంచడానికి ఉపయోగిస్తారు.
రిపోర్ట్ చేయాలి: ఈ ఇమెయిల్‌ను భారతదేశ అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అయిన cybercrime.gov.inకి పంపండి. అప్రమత్తంగా ఉండండి. అలాంటి మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?