ఒప్పో ఫైండ్ ఎక్స్4 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. దీన్ని బట్టి ఇందులో 120 హెర్ట్జ్ డిస్‌ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్4లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను అందించనున్నారని లీకులు వస్తున్నాయి. 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ సంవత్సరం మార్చిలో లాంచ్ అయిన ఒప్పో ఫైండ్ ఎక్స్3 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.


ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను టీజ్ చేశారు. ఈ టిప్‌స్టర్ తెలిపిన దాని ప్రకారం.. ఇందులో 6.7 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1440పీగా ఉంది. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుందని తెలుస్తోంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లను అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ లేదా 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


ఇందులో 12 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ, స్టోరేజ్ వివరాలు ఇంకా తెలియరాలేదు. 


ఒప్పో ఫైండ్ ఎక్స్3 ప్రో ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.2 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ 10 బిట్ కర్వ్‌డ్ ఎడ్జ్‌డ్ డిస్‌ప్లే ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.


ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్, 3 మెగాపిక్సెల్ మైక్రోలెన్స్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా అందించారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి