Oppo F23 5G: అదిరిపోయే ఫీచర్లతో Oppo F23 5G విడుదల, ఈ నెలలోనే సేల్ - ధ‌ర ఎంతంటే?

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. Oppo F23 5G పేరుతో దేశీ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ నెల 18 నుంచి సేల్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.

Continues below advertisement

సరికొత్త స్మార్ట్ ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకునే  చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో, మరో సూపర్ డూపర్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. Oppo F23 5G పేరుతో ఈ నూతన స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి  లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో అద్భుతమైన కెమెరా పని తీరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూపొందించింది. ఒప్పో ఎఫ్ సిరీస్ ఫోన్ల‌లో ప్రత్యేకంగా కెమెరా క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తోంది. తాజా స్మార్ట్ ఫోన్ లోనూ కెమెరా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.

Continues below advertisement

Oppo F23 5G ధర ఎంతంటే?

సరికొత్త Oppo F23 5G చూడ్డానికి  ప్రీమియం రెనో 8 సిరీస్ మాదిరిగానే కనిపిస్తున్నా, కొన్ని మార్పులతో అందుబాటులోకి రాబోతోంది.  ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రెండు రంగుల్లో విడుదల చేసింది. ఒకటి బోల్డ్ గోల్డ్‌ కలర్ కాగా, మరొకటి కూల్ బ్లాక్ క‌లర్స్‌. మే 18 నుంచి Oppo F23 5G  సేల్ మొదలు కానుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 25 6జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్  వేరియంట్ లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ రూ. 24,999గా ఫిక్స్ చేసింది.

అదిరిపోయే కెమెరా క్వాలిటీ

Oppo F23 5G  స్మార్ట్ ఫోన్ మీడియం రేంజ్ బ‌డ్జెట్ క‌స్ట‌మ‌ర్ల‌ను బాగా ఆకర్షిస్తోంది. స్లిమ్ బాడీ, ఫుల్ హెచ్‌డీ+ రిజ‌ల్యూష‌న్‌, 6.7 అంగుళాల డిస్‌ ప్లే ఆకట్టుకుంటోంది. క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగ‌న్ 695 ఎస్ఓసీ చిప్‌ సెట్‌, 67డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో  5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని కలిగి ఉంది. ఇక కెమెరా అద్భుతమైన ఫీచ‌ర్లతో రానుంది.  ఏఐ ఆధారిత 64 ఎంపీ ప్రైమ‌రీ కెమెరాతో పాటు బ్యాక్ సైడ్ రెండు 2 MP కెమెరాలు ఉన్నాయి.  ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. హై క్వాలిటీ ఫొటోల కోసం పోర్ట్ర‌యిట్ మోడ్, ఏఐ పోర్ట్ర‌యిట్ రీట‌చింగ్‌, సెల్పీ హెచ్‌డీఆర్‌, ఏఐ క‌ల‌ర్ పోర్ట్ర‌యిట్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌ సెట్‌ కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ లను కలిగి ఉంటుంది.  బోర్డ్‌ లోని సెన్సార్‌లలో యాక్సిలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ లో అద్భుతమైన పనితీరును కనబర్చనుంది.  

మే 18 నుంచి సేల్, రూ.2,500 వరకు ఫ్లాట్ డిస్కౌంట్  

ఒప్పో ఇండియా స్టోర్స్ తో పాటు  అమెజాన్‌‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ సరికొత్త స్మార్ట్‌ ఫోన్ ప్రస్తుతం భారత్‌లోని ఒప్పో వెబ్‌సైట్, అమెజాన్‌లో ప్రీ- ఆర్డర్‌ బుకింగ్ తీసుకుంటుంది. మే 18 నుంచి సేల్ ప్రారంభం కానుంది. F23 5G ఫోన్‌ మీద రూ.2,500 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. ICICI, HDFC బ్యాంక్ కార్డులతో రూ. 23,748కు కొనుగోలు చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.2 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

Read Also: వాట్సాప్ సరికొత్త ఫీచర్ - ఇకపై మీ చాట్‌ను ఎవరికీ కనిపించకుండా లాక్ చేసుకోవచ్చు!

Continues below advertisement
Sponsored Links by Taboola