Oppo A3 Pro Launched: ఒప్పో ఏ3 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన ఒప్పో ఏ2 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై ఒప్పో ఏ3 పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. ఐపీ69 రేటింగ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. 360 డిగ్రీల యాంటీ ఫాల్ బాడీతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో ఏ3 ప్రో రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


ఒప్పో ఏ3 ప్రో ధర (Oppo A3 Pro Price)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో రూ.23,000) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,199 (మనదేశ కరెన్సీలో రూ.25,400) యువాన్లుగానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో రూ.28,900) ఉంది. ఏప్రిల్ 19వ తేదీన దీనికి సంబంధించిన సేల్ చైనాలో ప్రారంభం కానుంది. అజూర్, క్లౌడ్ బ్రొసేడ్ పౌడర్, మౌంటెయిన్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందో లేదో తెలియరాలేదు.


ఒప్పో ఏ3 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Oppo A3 Pro Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ కర్వ్‌డ్ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందించారు. 360 డిగ్రీ యాంటీ ఫాల్ బాడీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌పై ఒప్పో ఏ3 ప్రో పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను ఇందులో అందించారు.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలను ఒప్పో అందించింది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఒప్పో ఏ3 ప్రోలో అందించారు.


512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఒప్పో ఏ3 ప్రోలో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది