New SIM Card Rules: ప్రస్తుతం సెల్ ఫోన్ల వినయోగం పెద్ద సంఖ్యలో పెరిగింది. ఒక్కో వ్యక్తి రెండు, మూడు సెల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 6 సిమ్ కార్డులు ఉంటున్నాయి. జనాలు తమ పనులను చాలా వరకు మోబైల్ ఫోన్ ద్వారానే చక్కదిద్దుకుంటున్నారు. సినిమా టికెట్లు మొదలుకొని విమాన టికెట్ల వరకు ఫోన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు మోబైల్ కేంద్రంగానే జరుగుతున్నాయి. రోజు రోజుకు మొబైల్ సేవల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డుల ద్వారా ఎలాంటి ముప్పు వాటిళ్ల కుండా నిబంధనలను కఠినతరం చేస్తోంది.


డిసెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్


డిసెంబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా సిమ్ కార్డుల నిబంధనలు పూర్తిగా మారనున్నాయి. సిమ్ కార్డుల అమ్మకాల విషయంలో సేఫ్టీ, సెక్యూరిటీని పెంచబోతుంది కేంద్ర ప్రభుత్వం. విచ్చలవిడిగా పెరిగిపోతున్న సిమ్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిబంధనలను తీసుకురాబోతోంది.  ఈ నేపథ్యంలో  కొత్త సిమ్ కార్డు తీసుకోవాలి అనుకునే వారు నూతన నిబంధనల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.


సిమ్ కార్డు కొత్త నిబంధనలు ఇవే!    


1. ఇకపై ఒక వ్యక్తి ఐడీ మీద ఎక్కువలో ఎక్కువగా 9 సిమ్ కార్డులను పొందే అవకాశం ఉంటుంది. 


2. ఏదైనా కారణం చేత సిమ్ కార్డు సేవలను నిలిపివేస్తే, మూడు నెలల వ్యవధిలో ఆ నెంబర్ ను మరొకరికి కేటాయిస్తారు.


3. వినియోగదారులు సిమ్ కార్డు తీసుకునే సమయంలో ఆధార్ స్కానింగ్ తో పాటు డెమోగ్రాఫీ డేటా తీసుకుంటారు. 


4. ఇకపై సిమ్ కార్డులు అమ్మే డీలర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.


5. సిమ్ కార్డు డీలర్ల  పోలీస్ వెరిఫికేషన్ బాధ్యతలను సదరు టెలికం కంపెనీల ఆపరేటర్లు తీసుకోవాల్సి ఉంటుంది.


6. సిమ్ కార్డులు అమ్మే దుకాణాలకు వెళ్లి ఆయా నెట్‌వర్క్ సంస్థలు కేవైసీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.


నిబంధనలను నిబంధనలు ఉల్లంఘిస్తే?


కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఈ నిబంధనలు ఎవరు అతిక్రమించినా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందినిబంధనలు పాటించని వారికి  రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్షకూడా అమలు చేసే అవకాశం ఉంది. నిజానికి కొత్త సిమ్ కార్డులకు సంబంధించిన కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచే అమలు చేయాలని భావించింది. అయితే, కొన్ని కారణాలతో రెండు నెలలు పోస్టు పోన్ చేసింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇక మోసపూరిత ప్రకటనలు ఇచ్చే సిమ్ కార్డుల విషయంలో కేంద్రం సీరియస్ గా ఉంది. ఇలాంటి ప్రకటనల కోసం తీసుకున్న 52 లక్షల సిమ్ కార్డు కనెక్షన్లు ఇప్పటికే డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.  


Read Also: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply