Instagram photo edit: అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి.  సోషల్ మీడియాను ఉపయోగించే వారిలో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ ను కూడా వాడుతారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో మధుర జ్ఞాపకాలను పంచుకునేందుకు ఇన్ స్టా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చక్కటి ఫోటోలను అందరితో షేర్ చేసుకోవచ్చు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను పోస్ట్ చేసిన తర్వాత ఒక్కోసారి మనకు బాగా లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి వారి కోసమే ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. పోస్టు చేసిన ఫోటోను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. క్యాప్షన్ మార్చుకోవాలనుకున్నా, ఫోటోను మరింత మెరుగ్గా ఎడిట్ చేసుకోవాలనుకున్నా ఇకపై సాధ్యమే అంటోంది ఇన్‌స్టాగ్రామ్. ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..  


పోస్టు చేసిన తర్వాత ఎందుకు ఎడిట్ చేయాలి?


ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఫోటోను ఎడిట్ చేయాలనుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు, ఫోటోకు పెట్టిన క్యాప్షన్‌లలో అక్షర దోషాలు రావచ్చు. లేదంటే, తప్పుగా ఇతర అకౌంట్లు ట్యాగ్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఎడిటింగ్ ద్వారా తప్పులను సరి చేసుకోవచ్చు. ఫోటోెలను పోస్టు చేసిన తర్వాత క్వాలిటీ సరిగా లేదని గ్రహిస్తే, దాన్ని మళ్లీ మంచి క్వాలిటీ ఫోటోగా తీర్చి దిద్దుకోవచ్చు. ఒక్కోసారి రకరకాల ఫిల్టర్లు, ఎఫెక్టులతో ఫోటోలను గతంలో కంటే మరింత అందంగా తయారు చేసుకోవాలని అనుకుంటే ఎడిటింగ్ తప్పనిసరి. ఒక్కోసారి ఫోటోలోని కంటెంట్ మారితే ఎడిట్ చేసి మళ్లీ పోస్టు చేసుకునే అవకాశం ఉంటుంది. రకరకాల కారణాలతో పోస్టు చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇన్‌స్టాగ్రామ్‌.


పోస్ట్ చేసిన తర్వాత ఫోటోలను ఎలా ఎడిట్ చేయాలంటే?   


1. ముందుగా మోబైల్ లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ ఓపెన్ చేయాలి.


2. ఆ తర్వాత ప్రొఫైల్‌ లోకి వెళ్లాలి. ఎడిట్ చేయాలి అనుకున్న పోస్టును కనుగొనేందుకు కిందికి స్క్రోల్ చేయాలి.


3. పోస్ట్ కుడి వైపు ఎగువ మూలలో, ఎలిప్సెస్ ను క్లిక్ చేయాలి. అనంతరం మోర్ ఆప్షన్స్ పై ట్యాప్ చేయాలి.


4. కనిపించే మెనులో ‘ఎడిట్’ అప్షన్ ను ఎంచుకోవాలి.


5. ఇప్పుడు మీ ఫోటో, క్యాప్షన్, లొకేషన్, ట్యాగ్స్ సహా అన్ని అంశాలను మార్చుకునే అవకాశం ఉంది. ఫోటోను కూడ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఉన్న ఫోటోను ఎడిట్ చేయాలనుకుంటే దానిపై ట్యాప్ చేయడం వల్ల ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వస్తాయి.  మీరు కోరుకున్న మార్పులు చేసి స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న కంప్లీట్ లేదంటే సేవ్ బటన్ ను నొక్కాలి.  


6. ఇప్పుడు ఎడిట్ చేసిన పోస్టు మీకు కనిపిస్తుంది. సవరించిన పోస్టు మీకు నచ్చినట్లుగా ఉందని భావిస్తే ఒకే. లేదంటే, మళ్లీ నచ్చినట్టుగా ఎడిట్ చేసుకునేందుకు పైన చెప్పిన ప్రాసెస్ ను మళ్లీ ఫాలో కావాల్సి ఉంటుంది.


Read Also: వాట్సాప్ వెబ్ వాడే వాళ్లు కచ్చితంగా ఆన్ చేసుకోవాల్సిన ఫీచర్ - లేకపోతే ప్రైవసీ డేంజర్‌లో!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply