Netflix Hidden features & Tricks: భారతదేశంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఓటీటీల్లో కూడా వినియోగదారులకు అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఆ ఆప్షన్లలో ఒకటి నెట్‌ఫ్లిక్స్. చాలా మంది యూజర్లు నెట్‌ప్లిక్స్‌లో తమకు ఇష్టమైన వెబ్ సిరీస్ లేదా షోలను చూడటానికి టైమ్ కేటాయిస్తున్నారు. ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ట్రెండింగ్ షోలు, సినిమాలు చాలా ఉన్నాయి. మొదటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వెబ్ సిరీస్‌లు, సినిమాలు చాలా ఉన్నాయి. వీటి కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో నెట్‌ఫ్లిక్స్‌కు ఎక్కువ క్రేజ్ ఉంది.


అందుకే ప్రజలు నెట్‌ఫ్లిక్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో అనేక సీక్రెట్లు, హిడెన్ ఫీచర్‌లు ఉన్నాయని మీకు తెలుసా? మీ స్ట్రీమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వీటిని ఉపయోగించవచ్చు. కాబట్టి అటువంటి హిడెన్ ట్రిక్స్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.


నెట్‌ఫ్లిక్స్‌లో సరైన కంటెంట్‌ను ఎలా ఎంచుకోవాలి?
ఏ కంటెంట్ సరైనది, ఏది కాదనే దాని గురించి వినియోగదారులు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతారు. దీన్ని తెలుసుకోవడానికి వినియోగదారులు స్నేహితుల సహాయం కూడా తీసుకుంటారు. కానీ అది కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. కానీ ఇప్పుడు మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో మీరు ఏదైనా వెబ్ సిరీస్ చూసేటప్పుడు థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ ఆప్షన్ కనిపిస్తుంది. మీకు నచ్చిన కంటెంట్‌కు ధంబ్స్ అప్ ఇస్తే అప్పుడు అటువంటి కంటెంట్ మీకు కనిపిస్తుంది. దీని సహాయంతో వినియోగదారులకు వారికి నచ్చే కంటెంట్‌ అందుబాటులోకి వస్తుంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


కంటెంట్ కస్టమైజేషన్ కూడా...
నెట్‌ఫ్లిక్స్ దాని వినియోగదారులకు ఒక అకౌంట్ నుంచి వేర్వేరు ప్రొఫైల్‌లను సెటప్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. తద్వారా మీరు మీ ప్రొఫైల్ కోసం కస్టమైజ్డ్ కంటెంట్‌ను సెట్ చేయవచ్చు. అంతేకాకుండా పిల్లల కోసం ప్రత్యేక ప్రొఫైల్‌ను కూడా సెటప్ చేయవచ్చు.


మీకు కావాల్సిన కంటెంట్ పొందండిలా...
నెట్‌ఫ్లిక్స్ తీసుకువచ్చిన ఈ ఫీచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ నుంచి తమకు ఇష్టమైన కంటెంట్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు. కానీ వారు మీ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తారనే గ్యారెంటీ లేదు. ఇది కాకుండా వినియోగదారులు జస్ట్‌వాచ్ అనే యాప్‌ను ఉపయోగించవచ్చు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో షోలను కనుగొనడంలో ఇది సహాయ పడుతుంది.


పాస్‌వర్డ్ ఇవ్వకుండా అకౌంట్ షేరింగ్...
స్నేహితులు తరచుగా తమ నెట్‌ఫ్లిక్స్ ఖాతాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. కానీ ఆ పాస్‌వర్డ్ వారు ఎవరికి ఇచ్చి ఉంటారో అని కొనుగోలు చేసిన యూజర్ ఆందోళన చెందుతూ ఉంటారు. మీరు AccessURL అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించడం ద్వారా మీ ఆందోళనలను వదిలించుకోవచ్చు. ఈ టూల్ మీకు టైమ్ లిమిట్‌తో షేర్ చేయగల లింక్‌ని జనరేట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇది మీ పాస్‌వర్డ్‌ను రివీల్ చేయకుండా టెంపరరీ షేరింగ్ ఆప్షన్‌ను ఇస్తుంది.



Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?