NASA Latest Research On Solar Eclipse: ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహం ఏర్పడబోతోంది. ఈ గ్రహణాన్ని తిలకించేందుకు కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్రహణం కారణంగా అమెరికా, కెనడా, మెక్సికో లోని కొన్ని ప్రాంతాలు చీకటిమయం కానున్నాయి. ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అమెరికా పరిశోధన సంస్థ నాసా రెడీ అవుతోంది. సూర్యగ్రహణాల కారణంగా భూ వాతావరణంలో కలిగే మార్పులపై పరిశోధనలు చేపట్టబోతోంది. సూర్యగ్రహణ చీకట్లోకి మూడు రాకెట్లను పంపి స్టడీ చేయబోతోంది.


మూడు దేశాల నుంచి మూడు రాకెట్ల ప్రయోగం


సూర్యుడికి భూమికి మధ్యగా చంద్రుడు అడ్డుగా వచ్చిన సమయంలో అమెరికాలో పూర్తిగా చీకటిపడనుంది. సమయంలో మూడు రాకెట్లను నింగిలోకి పంపించనుంది. వీటిలో ఒకటి అమెరికా నుంచి మిగతా రెండింటిని కెనెడా, మెక్సికో నుంచి లాంచ్ ఛేయనున్నారు. వీటి ద్వారా వాతావరణ మార్పులను గమనించనున్నారు. నిజానికి భూమి తిరుగుతున్న సమయంలో సూర్యుడి కిరణాలు నెమ్మదిగా ప్రసరిస్తూ మధ్యాహ్నం సమయంలో తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. నెమ్మదిగా తగ్గుతూ సాయంత్రానికి సూర్యరశ్మి తగ్గుతుంది. అయితే, అకస్మాత్తుగా సూర్యరశ్మి తగ్గిపోతే ఏం జరుగుతుంది? అనేది విషయాన్ని నాసా తెలుసుకోబోతోంది.  






అయానోస్పియర్‌ కేంద్రంగా నాసా పరిశోధన   


అయానోస్పియర్ అనేది భూమి ఎగువ వాతావరణంలో భాగం. ఇది 55 నుంచి 310 మైళ్లు అంటే 90 నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో మధ్య విస్తరించి ఉంది. అయానోస్పియర్ ఎలక్ట్రాన్లు, పరమాణువులతో నిండి ఉంటుంది. ఇవి సాధారణంగా పగలు, రాత్రి సమయాల్లో విడిపోవడంతో పాటు తిరిగి కలిసిపోతాయి. అయితే, సూర్యగ్రహణాల కారణంగా తీవ్ర ప్రభావానికి గురవుతాయి. ఇలాంటి సమయంలో రేడియో, ఉపగ్రహ సమాచార మార్పిడికి ఆటంకం కలుగుతుంది.


పూర్తి స్థాయిలో సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అనేది తాజా ప్రయోగం ద్వారా నాసా గుర్తించనుంది. అమెరికా ప్రయోగించబోయే మూడు రాకెట్లు గరిష్టంగా 260 మైళ్లు అంటే 420 కిలో మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయి. ఈ రాకెట్లు చార్జ్డ్, న్యూట్రల్ పార్టికల్ డెన్సిటీతో పాటు చుట్టుపక్కల విద్యుత్ అయస్కాంత క్షేత్రాలను స్టడీ చేస్తాయి. గ్రహణం రోజున కొన్ని నిమిషాల పాటే వాతావరణంలోకి రేడియేషన్ ప్రభావం ఉంటుంది. భూవాతావరణంలో పలు మార్పులు కొనసాగుతాయి. రాకెట్ల ద్వారా ప్రయోగించే సైన్స్ ఎక్యుప్మెంట్స్ ను నాసా ఇప్పటికే శాటిలైట్స్ తో అనుసంధానం చేసింది. ప్రయోగ సమయంలో గుర్తించే అంశాలను వెంటనే శాటిలైట్లు నాసా కేంద్రానికి అందిస్తాయి.  






వచ్చే వారంలోనే అరుదైన ప్రయోగం   


ఏప్రిల్ 8న అమెరికా వాలోప్స్ ద్వీపంలో సూర్యుని కాంతిలో 81.4 శాతం మాత్రమే గ్రహణం ద్వారా నిరోధించబడుతుంది. అయినప్పటికీ ఈ ప్రయోగం ద్వారా పూర్తి స్థాయిలో వాతావరణ మార్పులను గుర్తించే అవకాశం ఉంది. గత సంవత్సరం అక్టోబర్‌లో రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం సమయంలో నాసా పరిశోధన బృందం ఇలాంటి ప్రయోగమే చేపట్టింది. సూర్యరశ్మి అకస్మాత్తుగా తగ్గడం ద్వారా రేడియో, ఉపగ్రహ కమ్యూనికేషన్‌లను ప్రభావితం అవుతాయని గుర్తించింది.


Read Also: ప్రపంచవ్యాప్తంగా ఆ సమస్యలో ఇండియానే టాప్​.. దాని నిర్మూలన కోసమే ఏటా అవగాహన సదస్సులు