Motorola New Phone: మోటొరోలా రేజర్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక క్లామ్‌షెల్ స్టైల్ ఫోల్డబుల్ హ్యాండ్ సెట్. బయటవైపు నాలుగు అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు. గత సంవత్సరం లాంచ్ అయిన మోటొరోలా రేజర్ 40 అల్ట్రాకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై మోటొరోలా రేజర్ 50 అల్ట్రా రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా వైర్డ్, వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ చైనాలో గతంలోనే లాంచ్ అయింది.


మోటొరోలా రేజర్ 50 అల్ట్రా ధర (Motorola Razr 50 Ultra Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.99,999గా నిర్ణయించారు. మిడ్‌నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే 2024 డే సేల్ సందర్భంగా జులై 20వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభంలో కొనుగోలు చేస్తే రూ.5,000 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ కూడా అందించనున్నారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.94,999కు తగ్గనుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు రూ.5,000 నుంచి ప్రారంభం కానున్నాయి.


Also Read: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్ - ‘మెటా AI’ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసా?


మోటొరోలా రేజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు (Motorola Razr 50 Ultra Specifications)
మోటొరోలా రేజర్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ ఇన్నర్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 165 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గానూ ఉంది. నాలుగు అంగుళాల ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను సెకండరీ డిస్‌ప్లేగా అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను డిస్‌ప్లే కోసం అందించారు.


12 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌పై మోటొరోలా రేజర్ 50 అల్ట్రా రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్‌తో పాటు 68W ఛార్జర్‌ను అందించనున్నారు.


మోటొరోలా రేజర్ 50 అల్ట్రాలో బయటవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్‌ అందుబాటులో ఉంది. ఇన్నర్ డిస్‌ప్లేలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇది సెల్ఫీ కెమెరాగా వర్క్ అవుతుంది.


5జీ,4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మూడు మైక్రోఫోన్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు సెక్యూరిటీని అందించనున్నాయి. దీని మందం 0.7 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉంది.



Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్‌ చిల్లు