మోటోరోలా ఇండియా తాజాగా భారత కస్టమర్ల కోసం జీ సిరీస్‌లో Moto G32 మోడల్‌ని పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యూరప్ లో మంది ఆదరణ దక్కించుకున్న ఈ స్మార్ట్ ఫోన్ కొద్ది రోజుల క్రితమే భారత్ లో విడుదల అయ్యింది. 90Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 50MP కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మోటో జీ32 కేవలం 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజైంది. విడుదల సమయంలో రూ.12,999 ఉండగా ఇప్పుడు రూ.11,749కే ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. ఈ ఫోన్ మినరల్ గ్రే,శాటిన్ సిల్వర్ కలర్ షేడ్స్‌లో లభిస్తుంది.
Moto G32 స్పెసిఫికేషన్స్..
మోటో జీ32లో 90Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఉన్న 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ వెల్లడించింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అయితే పగటి పూట బాగానే ఫోటోలు వస్తున్నా.. లైటింగ్ సరిగా లేని సమయంలో ఫోటోలు అంత మంచిగా రావడం లేదు. డిస్‌ప్లే 600 నిట్‌ల బ్రైట్ నెస్ కలిగి ఉంది. ఎండలో కూడా డిస్ ప్లే బాగానే కనిపిస్తుంది. అయితే, బ్రైట్‌నెస్ తక్కువ పెడితే ఫోన్‌ని ఉపయోగించడం కష్టంగా ఉంటుంది. క్యాండీ క్రష్ , స్నేక్ రివైండ్ వంటి తేలికపాటి గేమ్‌లు ఆడేందుకు ఇది సరిపోతుంది. పెద్ద గేమ్‌లు ఆడితే డివైస్ కొంచెం వేడెక్కుతుంది. ఇది ఫోన్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్ క్లీన్ UI, బ్లోట్‌వేర్ యాడ్స్ లేకుండా Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది.
బెస్ట్ బ్యాటరీ బ్యాకప్..
ఇక బ్యాటరీ విషయానికి వస్తే Moto G32 మొబైల్ లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ సిమ్, 4జీ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ కూడా ఉంది. మీకు ఇష్టమైన OTT షోలు, మ్యూజిక్ వీడియోలు, వీడియో గేమ్‌లను ఆస్వాదించవచ్చు.